దేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘బాలెనొ’ ఫేస్‌లిఫ్ట్ 2026 ఎడిషన్ యొక్క పూర్తి వేరియంట్ల వారీగా ధరల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త బాలెనొ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ. 9.99 లక్షల వరకు నిర్ణయించారు. కొత్త డిజైన్ ఎలిమెంట్స్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లు మరియు అధునాతన ఇంజన్‌తో ఈ కారును ఐదు ట్రిమ్ లెవెల్స్‌లో.. సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా, సరికొత్త ఆల్ఫా మార్కెట్లోకి తీసుకొచ్చారు.
Also Read : చిన్న శ్రీను షాక్… కేడర్ ముందే కంటతడి పెట్టిన బొత్స!
ధరల వివరాలను పరిశీలిస్తే.. బేస్ వేరియంట్ సిగ్మా ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. మిడ్-లెవెల్ వేరియంట్ డెల్టా పెట్రోల్ మాన్యువల్ ధర రూ. 7 లక్షలు, ఎఎమ్‌టి ధర రూ. 7.50 లక్షలు, మరియు సిఎన్‌జి ధర రూ. 7.92 లక్షలుగా నిర్ణయించారు. జెటా వేరియంట్‌లో పెట్రోల్ మాన్యువల్ రూ. 8 లక్షలు, ఎఎమ్‌టి రూ. 8.50 లక్షలు, సిఎన్‌జి రూ. 8.92 లక్షలుగా ఉంది. ఇక హై-ఎండ్ వేరియంట్ ఆల్ఫా పెట్రోల్ మాన్యువల్ ధర రూ. 9.10 లక్షలు, ఎఎమ్‌టి ధర రూ. 9.60 లక్షలుగా ఉండగా, సరికొత్త టాప్ వేరియంట్ ఆల్ఫా పెట్రోల్ మాన్యువల్ ధర రూ. 9.50 లక్షలు, ఎఎమ్‌టి ధర రూ. 9.99 లక్షలుగా కంపెనీ ఖరారు చేసింది.
Also Read : అమెరికాలో కాగ్నిజెంట్ సంస్థకు భారీ షాక్..!
పెట్రోల్ ఎఎమ్‌టి వెర్షన్లు మాన్యువల్ కంటే రూ. 50,000, మరియు సిఎన్‌జి వేరియంట్లు పెట్రోల్ మాన్యువల్ కంటే రూ. 92,000 అదనపు ధరను కలిగి ఉన్నాయి. ఈ 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మారుతి సుజుకి సరికొత్త మెకానికల్ మార్పును ప్రవేశపెట్టింది. పాత ఫోర్-సిలిండర్ కె12ఎహెచ్ ఇంజన్ స్థానంలో, ఇప్పుడు స్విఫ్ట్ మరియు డిజైర్‌లలో వాడుతున్న సరికొత్త 1.2-లీటర్, త్రీ-సిలిండర్ ‘జెడ్12ఇ’ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. పాత ఇంజన్‌తో పోలిస్తే పవర్ కాస్త తగ్గినప్పటికీ, మైలేజ్ మాత్రం భారీగా పెరిగింది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 23.80 కిమీ, పెట్రోల్ ఎఎమ్‌టి వేరియంట్ లీటరుకు 24.77 కిమీ, మరియు సిఎన్‌జి వేరియంట్ ఏకంగా కేజీకి 33.61 కిమీ మైలేజ్ ఇస్తాయని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.

