ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. గతంలో ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత తదుపరి సిలిండర్ కోసం వేచి చూడాల్సిన గడువును పెట్రోలియం మంత్రిత్వ శాఖ భారీగా తగ్గించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వినియోగదారులు తదుపరి రీఫిల్ కోసం సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వచ్చేది. అయితే, తాజా నిర్ణయంతో ఆ గడువును గణనీయంగా తగ్గిస్తూ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను వేటాడిన పోలీసులు.. నోటి దూలకు రియాక్షన్..!
గ్యాస్ సిలిండర్ల సరఫరాను మరింత సులభతరం చేసేందుకు మరియు వినియోగదారుల ఇబ్బందులను తొలగించేందుకు ఈ చర్యలు చేపట్టారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సామాన్య గృహ వినియోగదారులకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించారు. అంటే, ఇకపై ఒక సిలిండర్ బుక్ చేసుకున్న 25 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
Also Read : విజయసాయి కొత్త ‘దారి’ జగన్ కి బీ-టీంగా మారుతుందా?
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ఎల్పీజీ వినియోగదారులకు ఇది చాలా పెద్ద ఉపశమనం కానుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 45 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు ఈ నిర్ణయంతో చెక్ పడింది. ఇంధన లభ్యతను పెంచడం మరియు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు. ఈ నిర్ణయం వల్ల అత్యవసర సమయాల్లో గ్యాస్ సిలిండర్ కోసం ఎదురుచూసే తిప్పలు తప్పుతాయని భావిస్తున్నారు. ఇకపై గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్ని రకాల గృహ వినియోగదారులకు ఒకే రకమైన నిబంధన వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అందరికీ ఒకటే 25 రోజుల నిబంధనను తీసుకురావడం వల్ల సిలిండర్ల కొరత సమస్య తీరడమే కాకుండా, సకాలంలో రీఫిల్స్ అందుబాటులోకి వస్తాయని కేంద్రం చెప్తోంది.

