అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారిని ప్రతి నెలా లక్షన్నర రూపాయల లంచం ఇవ్వాలని, లేదంటే సెలవు పెట్టి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగినట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడైన సబ్ రిజిస్ట్రార్ రమణారావుకు సంబంధించిన ఒక ఆడియో కాల్ లీక్ కావడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : పైకి మాత్రమే సస్పెన్షన్.. వెనక మాత్రం..!
బాధితుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నేరుగా సబ్ రిజిస్ట్రార్ రమణారావును టార్గెట్ చేస్తూ ‘నెలకు రూ.లక్షన్నర లంచం ఇవ్వు, లేదంటే లీవ్ పెట్టి పొమ్మని’ బెదిరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆడియో వివాదం మరవక ముందే, ఇప్పుడు ఏకంగా ఒక ప్రభుత్వ అధికారిని లంచం కోసం బెదిరించారనే ఆరోపణలు రావడం ఎమ్మెల్యేను తీవ్ర రక్షణలో పడేసింది.
Also Read : టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. రూ. 3.5 లక్షల వరకు ఆఫర్స్..!
ఈ తాజా లంచం మరియు బెదిరింపుల ఆడియో లీక్‌పై అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రభుత్వ అధికారులపై ఈ స్థాయి ఒత్తిడి తీసుకురావడంపై విపక్షాలు, ప్రజలు మండిపడుతున్నారు. ఈ వివాదంపై స్పష్టత రావాల్సి ఉండగా, అధికారిక వర్గాలు లేదా ఎమ్మెల్యే క్యాంప్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం.

