Friday, August 21, 2026 06:55 PM
Friday, August 21, 2026 06:55 PM

భోగాపురం నుంచి విశాఖ ఎంత సమయమో తెలుసా.. భువనేశ్వరి క్లారిటీ..!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే విశాఖ కేంద్రంగా పలు అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. త్వరలో మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. ఈ విమానాశ్రయం ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడంలో భోగాపురం విమానాశ్రయం కీలకం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు.

Also Read : రెండో టెస్టుకు కుల్దీప్ యాదవ్‌ కు షాక్ తప్పదా..?

అయితే భోగాపురం విమానాశ్రయంపై తొలి నుంచి కొందరు పనిగట్టుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. సుమారు 50 ఏళ్లుగా విశాఖ వాసులకు సేవలందిస్తున్న విశాఖపట్నం ఎయిర్ పోర్టు మూసేసి.. భోగాపురం నుంచి కార్యకలాపాలు ప్రారంభించడం ఏమిటంటున్నారు. విశాఖ నుంచి భోగాపురం వెళ్లేందుకు ఏకంగా 2 గంటలు పైగా సమయం పడుతుందని.. ఇక అనకాపల్లి నుంచి అయితే 3 గంటలు పడుతుందంటున్నారు. విశాఖలో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయని.. కాబట్టి విమానం కంటే వందేభారత్ రైలు చాలా ఉత్తమం అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సరైన రవాణా సౌకర్యం లేదని.. ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమిటని ఆరోపిస్తున్నారు.

భోగాపురం విమానాశ్రయం మీద వస్తున్న ఆరోపణలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. భోగాపురం విమానాశ్రయం నుండి విశాఖపట్నం లేదా అనకాపల్లికి ప్రయాణించడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుందంటూ చాలా మంది చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఇలాంటి సమయంలో తన సొంత అనుభవాన్ని పంచుకోవాలని అనుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. సాధారణ మార్గంలో ప్రయాణించినప్పుడు, విశాఖపట్నం చేరుకోవడానికి సుమారు 45 నిమిషాలు, అనకాపల్లి చేరుకోవడానికి సుమారు 1 గంట 10 నిమిషాల సమయం పట్టిందన్నారు.

Also Read : ఈడీ సోదాలు.. వైసీపీ కొత్త నాటకం..!

ప్రయాణ సమయం అనేది సహజంగానే బయలుదేరే ప్రదేశం, ట్రాఫిక్ పరిస్థితులు, ఎంచుకున్న మార్గంపై ఆధారపడి మారుతూ ఉంటుందని.. అయితే, నా అనుభవం ప్రకారం, చర్చ జరుగుతున్న ఆ రెండు గంటల సమయం కంటే ప్రయాణం చాలా తక్కువ సమయంలోనే పూర్తయింది.. అంటూ వ్యాఖ్యానించారు. రవాణా సౌకర్యాలు, అనుబంధ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్న కొద్దీ, ప్రయాణ అనుభవం మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారుతుందని నమ్మకంగా ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ప్రాంతానికి గొప్ప అవకాశాలకు ఒక ద్వారం వంటిది. ఈ కొత్త రవాణా అనుసంధానం తీసుకురాబోయే అవకాశాల వైపు మనం చూద్దాం… అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

అయితే భువనేశ్వరి పోస్టుపై కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి సతీమణి కాబట్టి ప్రొటోకాల్ కాన్వాయ్, గ్రీన్ ఛానల్ ఉంటాయి. కానీ మాకు ఉండవు.. భోగాపురం నుంచి విశాఖ చేరుకోవడం చాలా కష్టంగా ఉందంటున్నారు. గాజువాక నుంచి విశాఖ నగరం దాటే వరకు ఎన్నో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని.. కాబట్టి విశాఖ నగరంలో ఫ్లై ఓవర్లు నిర్మించాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

కొండా సురేఖ పై...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబం...

మాట జాగ్రత్త.. పార్టీ...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు...

కూటమిలో అంతర్గతంగా అసహనం.....

కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల మధ్య విభేదాలు...

హైదరాబాద్ టార్గెట్‌గా పాక్...

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో...

పోల్స్