Thursday, August 13, 2026 02:54 PM
Thursday, August 13, 2026 02:54 PM

బర్త్ టూరిజంపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం..!

పిల్లలకు ఎలాగైనా అమెరికా పౌరసత్వం ఇప్పించాలనే ఉద్దేశంతో సాగే బర్త్ టూరిజం వ్యవహారాలపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. కేవలం అమెరికా గడ్డపై పిల్లలను కనడమే లక్ష్యంగా వీసాలను దుర్వినియోగం చేస్తూ వచ్చే విదేశీయులను అడ్డుకునేందుకు ట్రంప్ సర్కార్ సరికొత్త నిబంధనలను, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించింది. ఈ క్రమంలోనే, నిబంధనలను ఉల్లంఘించి కేవలం ప్రసవం కోసమే 9వ నెల గర్భంతో అమెరికాకు వచ్చిన 600 మందికి పైగా విదేశీయుల వీసాలను అమెరికా విదేశాంగ శాఖ గత నెల రోజుల్లోనే రద్దు చేయడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.

Also Read : సరికొత్త మహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అప్పుడే..!

అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లోని లోసుగులను ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ నెట్‌వర్క్‌లను పూర్తిగా ఛేదించేందుకు యూఎస్ విదేశాంగ శాఖ ‘బర్త్ టూరిజం ప్రివెన్షన్ టాస్క్‌ఫోర్స్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ విదేశీ ప్రయాణికుల పాత ప్రయాణ హిస్టరీలను, వీసా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పదంగా ఉన్న వీసాలను ఏరిపారేస్తోంది. కేవలం పర్యాటక వీసాల రూపంలో వచ్చి ఇక్కడ పౌరసత్వం పొందాలని చూసే గర్భిణీలకే కాకుండా, వారికి నకిలీ పత్రాలు సృష్టించి గైడెన్స్ ఇస్తున్న అంతర్జాతీయ బ్రోకర్ల ముఠాలపై కూడా ఈ టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది.

Also Read : గ్రూప్‌ 1 అక్రమాలు నిజమే.. వైసీపీకి షాక్‌ ఇచ్చిన సిట్‌

ఈ భారీ వీసా రద్దుల వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. “అమెరికా పౌరసత్వం అనేది మార్కెట్లో కొనుక్కోవడానికి ఏమీ అమ్మకానికి లేదు” అని ఆయన స్పష్టం చేశారు. నేరపూరిత ముఠాలు అమెరికా చట్టాలను దుర్వినియోగం చేస్తూ విదేశీయులకు వీసా మోసాలు నేర్పిస్తున్నాయని, మన దేశ పౌరసత్వానికి ఉన్న పవిత్రతను, గౌరవాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడదని ఆయన తేల్చి చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇమ్మిగ్రేషన్ విధానాలపై తీసుకుంటున్న వరుస కఠిన నిర్ణయాలలో భాగంగానే ఈ చర్యలు ఊపందుకున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కృష్ణా, గుంటూరు జిల్లాల...

కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని...

కర్నూలులో పొలిటికల్ హీట్.....

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం పరిసర...

గ్రూప్‌ 1 అక్రమాలు...

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌ వన్...

ఏపీలో కొత్త మద్యం...

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీపై ఉత్కంఠ...

రాజకీయాల్లోకి జగన్ వారసురాలు.....

వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయంగా కంచుకోటగా ఉన్న...

డీఎస్సీ ఉద్యమం.. టీచర్లు...

వైసీపీ డీఎస్సీ ధర్నా.. ఆపరేషన్‌ సక్సెస్...

పోల్స్