ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా మరో సంచలన పొలిటికల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రెంటచింతల మండలంలో జరిగిన వైకాపా యువజన విభాగం నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్య కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. మాచర్ల నుంచి తన గ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్న చెన్నారెడ్డిని కారుతో ఢీకొట్టి, కళ్లలో కారం చల్లి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘోర హత్యను రాజకీయంగా వాడుకుని, ప్రత్యర్థి పార్టీ నేతలను ఇరికించాలని చూసిన వైకాపా అధినేత వైఎస్ జగన్ కు తీవ్ర భంగపాటు ఎదురైంది.
Also Read : విమర్శలకు చెక్ పెట్టడంలో విఫలమయ్యారా..?
హత్య విషయం తెలుసుకుని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అక్కడ నుంచే నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ కలిపారు. పక్కనే ఉన్న మృతుడి తండ్రి భాస్కరరెడ్డికి ఫోన్ అందించారు. జగన్ ఫోన్ లో మాట్లాడుతూ.. “అరెరె.. ఎవరితో చేయించారు..? ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకుని చేయించారా?” అంటూ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డిని ఇరికించేలా ప్రశ్నలు వేశారు. అయితే జగన్ ప్రశ్నకు మృతుడి తండ్రి భాస్కరరెడ్డి ఏడుస్తూ.. “ఎమ్మెల్యే కాదు.. పాడు కాదు.. చంపింది మనోళ్లే అన్నా! మన మనుషులు కూడా తేలారు.. సొంతోళ్లే.. బయటోళ్లు కాదు.. వేరే పార్టీ కాదు అన్నా.. మనోళ్లే!” అంటూ స్పష్టంగా నిజాలు ఒప్పేసుకున్నారు.
Also Read : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం గుడ్ న్యూస్..!
సొంత పార్టీలోని అంతర్గత వర్గపోరు వల్లే తన కొడుకు ప్రాణాలు పోయాయని తండ్రి కుండబద్దలు కొట్టడంతో జగన్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సీన్ రివర్స్ అయిందని గ్రహించిన జగన్.. ఏమీ మాట్లాడలేక కేవలం “హ.. సారీ అన్నా..” అంటూ నీళ్లు నమలడం లీకైన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కంగారుపడి ఫోన్ ను తన చేతికి తీసుకుని కవర్ చేయడానికి ప్రయత్నించగా, జగన్ వెంటనే ఫోన్ కట్ చేసేశారు. ఈ పూర్తి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి చెక్కర్లు కొడుతోంది. ఒక కార్యకర్త ప్రాణం పోతే, దాన్ని పరామర్శించే ఫోన్ కాల్ లో కూడా రాజకీయం వెతకడం ఏంటని సామాన్య జనాలు ప్రశ్నిస్తున్నారు.

