Saturday, September 26, 2026 06:54 AM
Saturday, September 26, 2026 06:54 AM

ఎల్ నినో కరవుపై పట్టిసీమ విజయం..!

తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం కృష్ణా డెల్టా పరిధిలోని సాగు భూములకు మళ్లీ ప్రాణదాతగా నిలిచింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీపై తన కాన్వాయ్ నిలిపి, పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటిని స్వయంగా పరిశీలించారు. గోదావరి జలాలతో నిండు కుండలా మారిన ప్రకాశం బ్యారేజ్ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

Also Read : ఏఐ డీప్‌ఫేక్‌పై కేంద్రం కీలక నిర్ణయం..!

ఈ ప్రస్తుత సీజన్ లో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 17.52 టిఎంసిల గోదావరి నీటిని కృష్ణా నదికి విజయవంతంగా తరలించినట్లు సాగునీటి శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో వృథాగా పోయే జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించడం వల్ల ఇక్కడి రైతులకు సాగునీటి కొరత లేకుండా ఎంతో లబ్ధి చేకూరుతోందని సీఎం పేర్కొన్నారు.

Also Read : ఈవీ జోరు.. టాప్‌లో యూపీ.. మరి ఏపీలో..?

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సమృద్ధిగా నీరు వస్తుండటంతో బ్యారేజీ దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3,115 క్యూసెక్కులు, గుంటూరు చానల్ నుంచి 115 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని, సమర్థ నీటి నిర్వహణ ద్వారా సాగునీటి ఇబ్బందుల్ని అధిగమించేందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్...

భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై...

వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ...

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా...

గుండె పోటు కాదు.....

చనిపోయింది గుండెపోటుతో.. ఈ విషయాన్ని వైద్యులు...

మజ్లీస్ నుంచి దానం...

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ...

పోల్స్