Monday, August 10, 2026 01:18 PM
Monday, August 10, 2026 01:18 PM

ఒంగోలు పాలిటిక్స్‌లో కూటమి కుమ్ములాట..?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య రేగిన వివాదం ఒంగోలు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ, ప్రెస్ మీట్లు పెట్టి మరీ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసుకోవడంతో కూటమిలోని అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. బాలినేని చేసిన తప్పులను లెక్కిస్తే పుస్తకాలే సరిపోవని దామచర్ల విమర్శిస్తే, దామచర్ల చేస్తున్న అవినీతి మరియు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బాలినేని డిమాండ్ చేశారు.

Also Read :

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో బార్ షాపులను సిండికేట్ చేసి బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. బాలినేని చేసిన అక్రమాలపై కాణిపాకం గుడిలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, ఆయన రాగలరా అని సవాల్ విసిరారు. ఒకవేళ బాలినేని గనుక జనసేన పార్టీలో చేరకుండా ఉండి ఉంటే, గతంలో చేసిన పాపాలకు ఈపాటికే జైలుకు వెళ్లేవారని వ్యాఖ్యానించారు. కూటమి ధర్మాన్ని పాటించి తాము మౌనంగా ఉంటుంటే, అమావాస్యకు పౌర్ణమికి ఒంగోలుకు వస్తూ తమపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దామచర్ల మండిపడ్డారు.

Also Read :

దామచర్ల జనార్దన్ ఆరోపణలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంతే ఘాటుగా స్పందించారు. ఒంగోలులో తన అనుచరులను మరియు జనసేన కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఉన్న కక్షతోనే దామచర్ల వర్గం ఈ అక్రమాలకు పాల్పడుతోందని, మళ్లీ తాను ఎమ్మెల్యే అయితే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండి నాతో పాటు నా కుమారుడు కూడా పోటీ చేస్తాడని స్పష్టం చేశారు. స్థానిక క్రషర్ యజమానుల వివాదంలో తాను అధికారులతో మాట్లాడితే, బాలినేని ఏమైనా సీఎంఆ, డిప్యూటీ సీఎంఆ అంటూ హేళనగా మాట్లాడటం సరికాదన్నారు. ఇకపై వారంలో నాలుగు రోజులు ఒంగోలులోనే ఉంటూ, ప్రజలకు జరిగే అన్యాయాలపై పోరాడతానని బాలినేని తేల్చి చెప్పారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

స్థానిక పోరు.. రణమా.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా...

ఏపీలో త్వరలోనే క్యాబినెట్‌...

ఏపీ రాజకీయాల్లో మరోసారి కేబినేట్ ప్రక్షాళన...

పార్టీ ఆఫీస్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు...

పోలీసులను టార్గెట్ చేసిన...

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన...

జనసేన జెండా కోసం...

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా...

పోల్స్