నీట్ పరీక్ష వ్యవహారంలో.. కేంద్రానికి సీజేపి ఇచ్చిన షాక్ మరువక ముందే మరో షాక్ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. తాజాగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో జరిగిన భారీ అక్రమాలు, పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. ఈ అవినీతిపై ఉక్కుపాదం మోపాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ యువ విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహతో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వేదికగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
Also Read : ఢిల్లీ పోలీస్ లపై అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు..!
జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చాపార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న దేవేంద్ర మహతో నేతృత్వంలో సాగుతోన్న ఈ పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల నుండి భారీ మద్దతు లభిస్తోంది. ఈ దీక్షలో భాగంగా దేవేంద్ర నాథ్ మహతో ప్రధానంగా రెండు డిమాండ్లను గట్టిగా వినిపిస్తున్నారు. అవినీతి అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న 14వ JPSC ప్రిలిమినరీ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, అలాగే పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ పాత్రపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ఉరవకొండలో పొలిటికల్ హీట్.. మాజీ ఎంపీ అరెస్ట్..!
పరీక్షల ప్రక్రియలో పూర్తి పారదర్శకత వచ్చే వరకు మరియు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వయంగా వచ్చి విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపే వరకు తన ప్రాణం పోయినా ఈ ఆమరణ నిరాహార దీక్షను విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో సోనమ్ వాంగ్‌చుక్ లాంటి నేతలు విద్యా వ్యవస్థ, పరీక్షల లీకేజీలపై చేసిన పోరాటాల తరహాలోనే, దేవేంద్ర నాథ్ మహతో జార్ఖండ్‌లో యువతను ఏకం చేస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈయన లేవనెత్తుతున్న నిరుద్యోగ సమస్య, పరీక్షల అవినీతి అంశాలు నేరుగా రాష్ట్రంలోని యువత ఓటు బ్యాంకును ప్రభావితం చేసేలా ఉండటంతో అధికార హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. రాబోయే రోజుల్లో పెద్ద పార్టీల ఓటు బ్యాంకుకు గండికొట్టేలా మారుతున్న ఈ విద్యార్థి గళాన్ని చూసి అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష బిజెపి సైతం ఈ యంగ్ లీడర్ దూకుడుకు వణికిపోతున్నాయి.

