Friday, July 31, 2026 09:32 PM
Friday, July 31, 2026 09:32 PM

భోగాపురం.. మూడు రాష్ట్రాల పవర్‌ హౌస్‌

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో శనివారం సరికొత్త అధ్యాయం మొదలుకాబోతుంది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారికంగా జాతికి అంకితం కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ, ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత కేవలం ఏపీ సరిహద్దులకే పరిమితం కాలేదు. భౌగోళికంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతంలో నిర్మాణం కావడంతో పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఆర్థిక, పారిశ్రామిక, ప్రయాణ అవసరాలకు ప్రధాన కేంద్రంగా మారనుంది. ఇండియాలో ఒకేసారి మూడు రాష్ట్రాల పారిశ్రామిక రంగాన్ని ఇంటర్నేషనల్‌ మార్కెట్‌తో అనుసంధానించే ఏకైక ఏరో-హబ్‌గా భోగాపురం చరిత్ర సృష్టించబోతోంది.

Also Read : అడ్డంగా దొరికిపోయిన కేటిఆర్..?

GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ – GVIAL ఆధ్వర్యంలో దాదాపు 2,200 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. మొదటి దశలోనే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా, 3.8 కిలోమీటర్ల పొడవైన అత్యాధునిక రన్‌వేతో దీనిని తీర్చిదిద్దారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల సామర్థ్యాన్ని 4 కోట్లకు పెంచేలా ప్రణాళికలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పాసెంజర్ విమానమైన ఎయిర్‌బస్ A380 వంటి వైడ్-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సైతం ఇక్కడ ఈజీగా ల్యాండ్ కాగలవు. అంతేకాకుండా, సరుకు రవాణాను సులభతరం చేసేందుకు ఇక్కడ నిర్మించిన మల్టీ మోడల్ కార్గో హబ్ ఈ ప్రాంతపు ఎగుమతులకు సరికొత్త వేగం అందించనుంది.

సముద్ర తీరం లేని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి భోగాపురం విమానాశ్రయం అత్యంత వేగవంతమైన అంతర్జాతీయ గేట్‌వేగా మారుతుంది. ముఖ్యంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కేంద్రమైన జగదల్‌పూర్ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ రోడ్డు మార్గంలో కేవలం 270 నుండి 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, సుక్మా, కొండగావ్, రాయ్‌పూర్ జిల్లాల ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఇకపై సులభంగా విదేశీ సర్వీసులను అందుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ప్రాంత వాసులు ఏకైక రాజధాని ఎయిర్‌పోర్ట్‌పై, ఢిల్లీ-ముంబైలపై ఆధారపడాల్సి రాగా, ఇకపై 5-6 గంటల్లో నేరుగా భోగాపురం చేరుకుని గల్ఫ్, ఆగ్నేయాసియా మరియు యూరప్ దేశాలకు ప్రయాణించవచ్చు. అలాగే బస్తర్ రీజియన్‌లోని ఖనిజ ఉత్పత్తుల ఎయిర్ కార్గో రవాణాకు భోగాపురం కీలకంగా మారనుంది.

Also Read : ఏపీలో పోలీసు వ్యవస్థ పని చేస్తుందా..?

ఒడిశా రాజధాని భువనేశ్వర్ విమానాశ్రయం ఆ రాష్ట్ర ఉత్తర, మధ్య జిల్లాలకు అందుబాటులో ఉన్నప్పటికీ, దక్షిణ ఒడిశా ప్రజలకు భోగాపురం ఎయిర్‌పోర్ట్ అత్యంత చేరువగా ఉంటుంది. ప్రధానంగా ఒడిశాలోని కొరాపుట్ , రాయగడ, గంజాం, బరంపూర్, మల్కాన్‌గిరి, నాబరంగ్‌పూర్, గజపతి జిల్లాలకు భోగాపురం అత్యంత సమీపంలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. రాయగడ లేదా కొరాపుట్ నుంచి భువనేశ్వర్ చేరుకోవడానికి 8 నుండి 10 గంటల సమయం పడితే, జాతీయ రహదారి మీదుగా భోగాపురానికి కేవలం 3 నుండి 4 గంటల్లో చేరుకోవచ్చు. దక్షిణ ఒడిశాలోని అల్యూమినియం, మైనింగ్, పేపర్ పరిశ్రమలకు, సామాన్య ప్రయాణికులకు ఈ ఎయిర్‌పోర్టు ఎంతో మేలు చేయనుంది.

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల ఛత్తీస్‌గఢ్, ఒడిశాల సరిహద్దు జిల్లాల రూపురేఖలు మారబోతున్నాయి. దుబాయ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ గమ్యస్థానాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానుండటంతో విదేశీ పెట్టుబడులు ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు వెల్లువెత్తే అవకాశం ఉంది. వ్యాపార కనెక్టివిటీతో పాటు, విదేశీ పర్యాటకులు అరకు, లంబసింగితో పాటు దక్షిణ ఒడిశాలోని కొరాపుట్ వ్యాలీ, బస్తర్ లోని ప్రకృతి అందాలను సందర్శించడానికి సులువవుతుంది. ఫలితంగా లాజిస్టిక్స్, ఆతిథ్య రంగం, ట్రావెల్ ఇండస్ట్రీలలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభించి, మూడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు భోగాపురం పవర్ హౌస్‌గా నిలవనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భోగాపురం భోగం ఎవరిది.....

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో...

జనసేనాని ఆన్ డ్యూటీ.....

జనసేనలో రాష్ట్ర అధికార ప్రతినిధుల వ్యవస్థను...

వాళ్ళను వదిలే ప్రసక్తే...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

కృష్ణా డెల్టాకు గోదారమ్మ...

గత రెండు నెలలుగా వర్షాలు లేక...

అడ్డంగా దొరికిపోయిన కేటిఆర్..?

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా...

పోల్స్