Wednesday, July 29, 2026 07:54 PM
Wednesday, July 29, 2026 07:54 PM

కాపులను రెచ్చగొడుతున్న వైసీపీ.. వర్కవుట్ అవుతుందా..?

రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి మరణం తర్వాత అధికార పార్టీకి కాపుల సెగ బాగానే తగిలినట్టు కనిపిస్తోంది. ఇటీవల ముద్రగడ పద్మనాభ రెడ్డి సంస్మరణ సభను కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి పార్టీలకు అతీతంగా కాపు నాయకులు హాజరయ్యారు, ప్రసంగించారు. ఇదే సందర్భంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరావు వేదిక పంచుకున్నారు. అంతేకాకుండా సభలో ఉమా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. 2019లో రాష్ట్రంలో అధికార మార్పిడికి ముద్రగడ చేసిన ఉద్యమమే కారణమని బోండా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటి పరిస్థితులే నెలకొన్నాయని, కాపులు తీవ్ర అలజడిలో ఉన్నారని ఉమా మాట్లాడడం చర్చకు దారితీసింది.

Also Read : ఉమా అసహనానికి కారణం అదేనా..!

ఉమా వ్యాఖ్యలు, అంబటితో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో.. టీడీపి అధిష్టానం రంగంలోకి దిగింది. ఉమాకు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరింది. ఇందుకు సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్‌లతో త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉమా చేసిన వ్యాఖ్యలపై కమిటీకి వివరణ ఇచ్చారు. మరోవైపు దీనిపై స్పందించిన ఉమా తన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరించారని, అవసరమైతే చంద్రబాబును కలిసి వాస్తవాలను వివరిస్తానని కూడా తెలిపారు. తన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా దీనిపై స్పందించారు. టీడీపీలో నిబంధనలు ఉమాలాంటి వారికేనని చంద్రబాబుకు మాత్రం ఉండదని చురకలంటించారు. తారకరత్న అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు విజయసాయిరెడ్డితో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడిన విషయాన్ని రాంబాబు గుర్తు చేశారు. తనపై ఉన్న అక్కసును ఉమాపై చూపించడం సరికాదంటూ అంబటి వ్యాఖ్యానించారు. మరోవైపు గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన కాపు జేఏసీ కార్యక్రమాల్లో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఆ వీడియోలను ఉమా అనుచరులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తమ నాయకుడు చేసింది తప్పు అయితే వీరి సంగతేంటని పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు.

ఉమా విషయంలో టీడీపీ అధిష్టానం చర్యలు ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠగా మారింది. తాను ఎటువంటి తప్పు చేయలేదని, పార్టీ లైన్ దాటలేదని, వాస్దవ పరిస్థితులను మాత్రమే వివరించానని, కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉమా చెబుతున్నారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ఈ అంశాన్ని సీరియస్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ కీలక నాయకులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ నాయకులతో ఎవరూ వేదికలు పంచుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read : ఇక రాష్ట్రాల వైపు ఫోకస్.. ప్రక్షాళన దిశగా అడుగులు..!

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే టీడీపీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్న భావన టీడీపీ కాపు నాయకుల్లో ఉంది. అది ముద్రగద పద్మనాభరెడ్డి సంస్మరణ సభ వేదికగా బయటపడింది. ఈ కారణంగానే టీడీపీ అగ్రనాయకత్వం అప్రమత్తమై డామేజ్ కంట్రోల్‌కు ప్రయత్నం చేస్తోందని అర్థమవుతోంది. ముందు నుంచీ దూకుడు కలిగిన నాయకుడిగా పేరున్న ఉమా అధిష్టానం నోటీసులను లెక్క చేయరేమో అని అంతా అనుకున్నారు. ఆయన మదిలో ఉన్న ఆలోచన ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ఆయన మాత్రం క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యారు. మరోవైపు వైసీపీలో కాపు నాయకులు ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. టీడీపీ నాయకత్వానికి కాపులపై ఏ మాత్రం మంచి ధోరణి లేదని, అందుకే ఉమాను ఈ విధంగా టార్గెట్ చేసిందని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో కాపులకు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు. ఈ పరిణామాలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందో వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వంగవీటి రాధా రాజకీయ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి అనే పేరుకు...

నేనేంటో నా భర్తకు...

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా...

జనసేన సంచలన నిర్ణయం.....

ఏపీలో అధికారంలో ఉన్న జనసేన పార్టీ...

మరో మాజీ మంత్రి...

వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం...

అల్లు అర్జున్ సంచలన...

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

జగన్ ట్రాప్ లో...

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం...

పోల్స్