Sunday, September 13, 2026 05:38 PM
Sunday, September 13, 2026 05:38 PM

21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీ.. అసెంబ్లీలో తీర్మానం..!

యువతను చట్టసభల్లోకి పెద్ద ఎత్తున తీసుకురావాలనే లక్ష్యంతో, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 21 ఏళ్లకే యువత సివిల్ సర్వెంట్లుగా, మేయర్లుగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు, వారికి చట్టసభల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు ఇవ్వకూడదని రేవంత్ ప్రశ్నించారు. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్లుగా నియమిస్తున్నా నియమిస్తున్న విషయాన్ని రేవంత్ గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఎందుకు అనుమతించకూడదని ప్రశ్నించారు.

దేశ జనాభాలో దాదాపు 30 శాతం ఉన్న ‘జెన్-జీ’ తరం గొంతుక చట్టసభల్లో వినిపించాలన్న రేవంత్.. వారికి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసే అవకాశాలు రావాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, వయోపరిమితి తగ్గింపు కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని సీఎం ప్రకటించారు. గతంలో ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు రాజీవ్ గాంధీ తగ్గించారని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గించాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ గుర్తుచేశారు. దేశంలో యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం గుర్తుచేశారు.

ఇదే సమయంలో తెలంగాణ అభివృద్ధిపైనా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, మూసీ నది అభివృద్ధి వంటి ప్రాజెక్టులపై తుది నిర్ణయాలు రావాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ ఈ దేశానికి ప్రధాని. ఆయన గుజరాత్‌ను, తెలంగాణను వేర్వేరుగా చూడకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ తరహాలోనే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని.. వికసిత భారత్ లక్ష్యంలో తెలంగాణ 10 శాతం వాటా అందించాలని కోరుకుంటున్నట్లు రేవంత్ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీస వయసు 25 సంవత్సరాలు. అదే, రాజ్యసభ సభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా పోటీ చేయాలంటే కనీస వయసు 30 సంవత్సరాలు ఉండాలి. కనీస వయోపరిమిని తగ్గించాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలకు అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు యువత స్పష్టం చేసింది. ఓటు వేసి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఇచ్చినప్పుడు.. చట్టసభలో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కదా అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కొత్త తరం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్ని పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్