Sunday, September 13, 2026 07:23 PM
Sunday, September 13, 2026 07:23 PM

రామాయణ ట్రైలర్ ఏమైంది..? హాలీవుడ్ రేంజ్‌ కోసమే ఆపారా..?

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌరాణిక ప్రాజెక్ట్‌ గా రూపుదిద్దుకుంటున్న రామాయణ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి, మరియు యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా చిత్ర యూనిట్ ఒక సంచలన అప్డేట్‌ను పంచుకుంది. జూలై 24న విడుదల కావాల్సిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌ను మేకర్స్ తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా వెనుక ఒక ఊహించని మాస్టర్ ప్లాన్ మరియు భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఒక అద్భుతమైన కారణం దాగి ఉంది.

Also Read : టాక్సిక్ – పెద్దలకు మాత్రమేనా.? నిర్మాత ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

రామాయణ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రేక్షకులకు అందించేందుకు హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తో గ్లోబల్ రిలీజ్ డీల్ కుదిరినట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు. 100 ఏళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని, ఒక మేజర్ హాలీవుడ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో అయితే విడుదల చేస్తారో.. ఈ సినిమాను కూడా అదే స్థాయిలో గ్లోబల్ మార్కెట్‌ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Also Read : కాక్రోచ్ డిమాండ్.. అంతటితో ఆగుతుందా..?

ఈ సరికొత్త అంతర్జాతీయ ప్రచార వ్యూహంలో భాగంగానే, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్‌గా ట్రైలర్‌ ను రిలీజ్ చేసేందుకు పాత డేట్‌ ను వాయిదా వేసి త్వరలోనే కొత్త తేదీని ప్రకటించబోతున్నారు. గ్లోబల్ మార్కెట్‌ ను సోనీ పిక్చర్స్ చూసుకుంటుండగా, భారతీయ మార్కెట్‌ లో ఈ సినిమా పంపిణీ బాధ్యతలను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ‘ధర్మా ప్రొడక్షన్స్’ దక్కించుకుంది. సహ నిర్మాతలైన నమిత్ మల్హోత్రా మరియు యష్ లు భారత్ లో పంపిణీ కోసం ధర్మా ప్రొడక్షన్స్‌ తో అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ వేదికగా మరియు అంతర్జాతీయంగా శాన్ డియాగో కామిక్-కాన్ 2026 లో ఈ సినిమా ట్రైలర్‌ ను ప్రత్యేకంగా ప్రదర్శించి అభిమానులను అలరించారు. ఈ భారీ విజువల్ వండర్ రామాయణ: పార్ట్ 1 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా, దీని రెండవ భాగం 2027 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్