Thursday, July 16, 2026 08:49 PM
Thursday, July 16, 2026 08:49 PM

వర్షాకాలంలో వణుకు పుట్టిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్లు..!

ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగిస్తూ దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, ఈ వర్షాకాలం తనతో పాటు అనేక వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా మోసుకొస్తోంది. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు మళ్లీ నమోదవుతుండటంతో పాటు, సాధారణ ఫ్లూ కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఈ రెండు ఇన్ఫెక్షన్లు శ్వాసకోశ వ్యవస్థపైనే ప్రభావం చూపుతుండటం, అలాగే జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు వంటి ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉండటంతో ప్రజలు ఏది సాధారణ జ్వరమో, ఏది కోవిడ్‌-19 వైరస్సో గుర్తించలేక గందరగోళానికి గురవుతున్నారు.

ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను గమనిస్తే.. సాధారణ సాధారణంగా అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరంతో మొదలవుతుంది. కోవిడ్-19 విషయానికి వస్తే జ్వరం చాలా స్వల్పంగా ఉండవచ్చు లేదా కొందరిలో అస్సలు జ్వరం లేకపోవచ్చు కూడా. అలాగే, ఆహారంలో రుచి, వాసనను అకస్మాత్తుగా కోల్పోవడం అనేది కోవిడ్-19 ప్రధాన లక్షణంగా పరిగణించబడుతుంది, కానీ ఇది సాధారణ ఫ్లూ లో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. వీటితో పాటు కోవిడ్‌ బాధితుల్లో పొడి దగ్గు సుదీర్ఘకాలం వేధిస్తుంది, ఫ్లూ బాధితుల్లో మాత్రం కొద్ది రోజుల్లోనే దగ్గు తగ్గుముఖం పడుతుంది.

లక్షణాలు కనిపించే కాలపరిమితిని బట్టి చూస్తే.. సాధారణ ఫ్లూ లక్షణాలు ఐదు నుంచి ఏడు రోజుల్లో తగ్గిపోతాయి. కానీ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టడానికి కొన్ని రోజులు లేదా రెండు వారాల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, మధుమేహం, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వర్షాకాలంలో పెరిగే తేమ, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల ఈ వైరస్‌ లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. వీటి బారిన పడకుండా ఉండటానికి క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించడం, తగినంత నీరు తాగుతూ రోగనిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. జ్వరం తీవ్రంగా ఉన్నా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అవి అక్రమ కేసులే.....

ఏపీలో జగన్‌ హయాంలో గతంలో ఎన్నడూ...

గల్లా జయదేవ్ కు...

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో...

పోలవరం-బనకచర్ల వివాదం.. తెలంగాణ...

తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా...

ఏపీలో ఎన్నికల సందడి.....

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి...

టీటీడీ కీలక సమాచారం...

తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ విభాగం...

రేవంత్ కు పవన్...

తెలంగాణలోని షాద్‌ నగర్‌ లో పోక్సో...

పోల్స్