Thursday, July 9, 2026 08:21 PM
Thursday, July 9, 2026 08:21 PM

వెలగపూడికి చెక్ పెడుతున్నారా..?

విశాఖ తూర్పు నియోజకవర్గం అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది రామకృష్ణ బాబు. 2009 నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు వెలగపూడి రామకృష్ణ బాబు. వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పటి వరకు ఆయనకు మంత్రి పదవి మాత్రం రాలేదు. నియోజకవర్గంలో మాత్రం మాస్ లీడర్‌గా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇపుడు ఆ ఎమ్మెల్యే వెలగపూడికి గండం పొంచి ఉందా? అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడిని రంగంలోకి రాజకీయ వారసుడిగా రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ నియోజకవర్గాల పునర్విభజనలో సమీకరణాలు మారుతున్నట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పగ్గాలు యువ నాయకుడి చేతల్లోకి వెళుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో 2029లో యువ నాయకులకే పెద్ద పీట వేస్తారన్న టాక్ ఉంది. ఈ పరిస్థితులు వెలగపూడి సీటు కిందకు నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read : రావణ్ కు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు..!

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో వెలగపూడి రామకృష్ణ బాబు ఘన విజయం సాధించినప్పటికీ, సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదనే అసంతృప్తి అనుచర వర్గంలో ఉంది. ఇదే సమయంలో ఆయన తన రాజకీయ వారసుడిని తదుపరి ఎన్నికల కోసం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన జిల్లా పార్టీ ఎమ్మెల్యేల సమీక్షా సమావేశంలో తూర్పు నియోజకవర్గాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడికి గతంతో పోలిస్తే ఓపిక తగ్గిందంటూ అధిష్ఠానం వ్యాఖ్యానించిందనే సమాచారం లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది.

Also Read : అనంతపురంలో అలజడికి తోపుదుర్తి భారీ స్కెచ్ ..!

తూర్పు నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న బీసీ ఓటర్ల ప్రభావం, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గాన్ని కలుపుకుని వెళ్లాలని అధిష్ఠానం వెలగపూడికి స్పష్టమైన సూచనలు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గాజువాకతో పాటు తూర్పు నియోజకవర్గంలో కూడా యాదవ సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆ వర్గ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో సామాజిక సమీకరణాలను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటే, యాదవ వర్గం నుంచి కొత్త, బలమైన నాయకులను తెలుగుదేశం పార్టీ ముందంజలోకి తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదు. దీంతో విశాఖ తూర్పు నియోజకవర్గ రాజకీయాలపై పార్టీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

Also Read : ఆసక్తి రేపుతోన్న జనసేన మీటింగ్.. ఏం జరగబోతోంది..?

ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జాతీయ కమిటీల నియామకాలతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీలో విశాఖ తూర్పునకు చెందిన యువ నాయకుడు, ప్రస్తుత వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్‌కు కీలక బాధ్యతలు దక్కడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సీనియర్ నాయకుడైన వెలగపూడి రామకృష్ణ బాబుకు, ఆయన వారసుడిగా ప్రచారంలో ఉన్న యువ నాయకుడికి పార్టీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అదే సమయంలో ప్రణవ్ గోపాల్‌కు అగ్రతాంబూలం ఇవ్వడం కొత్త చర్చకు దారితీసింది. మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహిత వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు వల్లే ప్రణవ్ గోపాల్‌కు ప్రతిష్టాత్మకమైన వీఎంఆర్డీఏ చైర్మన్ పదవిని అప్పగించడంతో పాటు పార్టీలోనూ కీలక స్థానం కల్పించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

2029 అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రణవ్ గోపాల్‌ను విశాఖ తూర్పు నుంచి బరిలోకి దించేందుకు అధిష్ఠానం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి ప్రణవ్ విశాఖ ఉత్తరంపై ఆశలు పెట్టుకున్నట్లు అతని అనుచరులు చెబుతున్నారు. ఉత్తర నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నేత ఎవరూ లేరు. ప్రస్తుతం కూటమి పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గం బీజేపీ వశమైంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు, నియోజకవర్గాల పునర్విభజనతో సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రణవ్ గోపాల్‌కు ఈ సారి సీటు పక్కా అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. అది ఉత్తరం లేదా తూర్పు అన్నది తెలియాల్సి ఉందని తెలుగు తమ్ముళ్లు అనుమానం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

హెచ్-1బీ వీసా, గ్రీన్...

అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశపడే హెచ్-1బీ...

అన్నపై చెల్లి ప్రత్యక్ష...

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు...

పెద్ద ప్లాన్‌తోనే జగన్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

అగ్రిగోల్డ్.. బాధితుల కోసం...

8 రాష్ట్రాల్లోని 23,599 ఎకరాల భూములకు...

రావణ్ కు బిగ్...

సంచలన వీడియోలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా...

ఫౌజీ సెట్ లో...

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్...

పోల్స్