Friday, October 9, 2026 11:37 PM
Friday, October 9, 2026 11:37 PM

మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. ఓపెన్ ఏఐ, క్లాడ్‌ లకు చెక్..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ మోడల్స్ నిర్వహణకు, టోకెన్ల వాడకానికి అవుతున్న ఖర్చులు ఊహించని స్థాయిలో తడిసి మోపెడవుతుండటంతో సంస్థ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తాము ఎంతో కాలంగా పార్ట్నర్‌ లుగా ఉన్న ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ మోడల్స్‌ పై ఆధారపడటాన్ని మైక్రోసాఫ్ట్ తగ్గించుకుంటోంది. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 లోని వర్డ్, ఎక్సెల్, అవుట్‌ లుక్ వంటి ప్రముఖ అప్లికేషన్లలోని ఏఐ ఫీచర్లు ఎక్కువగా చాట్ జీపీటీ, క్లాడ్ మోడల్స్ ఆధారంగా పనిచేసేవి.

Also Read : ఆసక్తి రేపుతోన్న జనసేన మీటింగ్.. ఏం జరగబోతోంది..?

అయితే, ఇప్పుడు ఆ స్థానంలో మైక్రోసాఫ్ట్ సొంతంగా అంతర్గతంగా అభివృద్ధి చేసిన “MAI” (Microsoft AI) మోడల్స్‌ ను రంగంలోకి దించుతోంది. ప్రస్తుతం ఎక్సెల్, అవుట్‌ లుక్ లలో వారానికి వచ్చే లక్షలాది యూజర్ ప్రాంప్ట్‌ లను మైక్రోసాఫ్ట్ తన సొంత ఏఐ మోడల్స్ ద్వారానే విజయవంతంగా ప్రాసెస్ చేస్తూ ఖర్చులను భారీగా మిగుల్చుకుంటోంది. ఖర్చుల నియంత్రణ ఏ స్థాయిలో ఉందంటే.. మైక్రోసాఫ్ట్ తమ అంతర్గత ఇంజనీరింగ్ టీమ్‌ లకు గతంలో ఇచ్చిన ఆంత్రోపిక్ క్లాడ్ కోడ్ లైసెన్స్‌ లను సైతం రద్దు చేసింది.

Also Read : ముందు రావణ్.. తర్వాత ఆయనే..!

ఉద్యోగులు ఈ టూల్‌ ను విపరీతంగా వాడటంతో ఏఐ బిల్లులు బడ్జెట్ పరిమితులను దాటిపోయాయి. దీంతో, ఆ లైసెన్సులను నిలిపివేసి, తమ సొంత ప్రాజెక్ట్ అయిన గిట్‌ హబ్ కోపైలట్ వైపు మళ్లాలని మైక్రోసాఫ్ట్ తన డెవలపర్లను ఆదేశించింది. యాపిల్, అమెజాన్, మెటా వంటి సంస్థల తరహాలోనే మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ సేవలను పూర్తి స్థాయిలో సొంతం చేసుకోవాలని చూస్తోంది. కేవలం వేరే సంస్థల ఏఐ మోడల్స్‌ ను అద్దెకు తీసుకుని వాడితే, భవిష్యత్తులో సదరు సంస్థలపై ఆధారపడాల్సి వస్తుందని, తాము మరో ఐబీఎం లాగా వెనుకబడిపోతామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భావిస్తున్నట్లు సమాచారం. అందుకే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఏఐ మోడల్స్ వరకు అన్నింటినీ స్వయంసమృద్ధిగా మార్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ అడుగులు వేస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్