Saturday, October 10, 2026 08:56 AM
Saturday, October 10, 2026 08:56 AM

మాట నిలబెట్టుకున్న కూటమి సర్కార్.. రైతులకు గుడ్ న్యూస్..!

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుత వ్యవసాయ సీజన్లకు సంబంధించి ఖరీఫ్, రబీ పంటల బీమా అమలుకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తమ వాటా ప్రీమియం సొమ్మును సకాలంలో చెల్లించిన రైతులందరికీ ఈ పంటల బీమా వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు పెట్టుబడి రక్షణ లభించనుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఖరీఫ్ సీజన్ పంటల నమోదుకు ప్రభుత్వం గడువులను ప్రకటించింది.

Also Read :ఆ సినీయర్‌ను నమ్మించి మోసం చేసిన జగన్..!

ఖరీఫ్‌లో సాగు చేసే ప్రధాన పంట అయిన వరి నమోదు కోసం ఆగస్టు 15వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. అలాగే, ఇతర నోటిఫైడ్ పంటలకు సంబంధించి ఈనెల 31 వరకు సమయం ఇచ్చారు. మరికొన్ని ప్రత్యేక నోటిఫైడ్ పంటల నమోదును ఈనెల 15వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. రబీ సీజన్‌ కు సంబంధించిన పంటల బీమా రిజిస్ట్రేషన్ గడువులను కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో ముందే ఖరారు చేసింది.

Also Read : ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..? కూటమిలో అసహనం..!

రబీ సీజన్ కింద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో వరి పంటను నమోదు చేసుకోవడానికి డిసెంబర్ 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అదేవిధంగా రబీలోని ఇతర నోటిఫైడ్ పంటల నమోదు కోసం డిసెంబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్దేశించారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ గడువుల లోగా రైతులు తమ పంట వివరాలను నమోదు చేసుకుని, నిర్దేశిత ప్రీమియం చెల్లించాలని అధికారులు కోరుతున్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిశీలించబోరని, కాబట్టి ఏపీలోని రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆర్థిక నష్టాల నుంచి రక్షణ పొందాలని సూచించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్