Monday, July 6, 2026 06:53 PM
Monday, July 6, 2026 06:53 PM

అయోధ్య తరహాలో మరో ఆలయంలో చోరీ..!

అయోధ్యలోని రామమందిరంలో విరాళాల చోరీ అంశం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఆలయంలో కూడా భక్తులు సమర్పించిన కానుకలు దోచేశారనే ఆరోపణలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. బద్రీనాథ్ ఆలయంలో విరాళాలు, కానుకల దొంగతనం జరిగిందని ఒక సామాజిక సంస్థ ఆరోపించడంతో బద్రీ కేదార్ ఆలయ కమిటీ.. బీకేటీసీ ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. రామ మందిరంలో విరాళాల దొంగతనంపై వివాదం చెలరేగిన కొద్ది రోజులకే.. గర్వాల్ పరిధిలోని బద్రీనాథ్, కేదార్నాథ్ సహా మరో 47 ఆలయాలలో కానుకల నిర్వహణలో కఠినమైన పర్యవేక్షణ, పారదర్శకత ఉండేలా చూడాలని బీకేటీసీ అధికారులను ఆదేశించిన మర్నాడే ఆరోపణలు వెలుగుల్లోకి రావడం కలకలం రేపుతోంది.

Also Read : వైసీపీ టూ బీజేపీ.. మార్పుల వేళాయే..!

‘భైరవ్ సేన సంఘటన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ బీకేటీసీ సీఈఓ సోహన్ సింగ్ రంగర్‌కు లేఖ రాసింది. బద్రీనాథ్ ఆలయంలో విరాళాలు, కానుకల దొంగతనంలో బీకేటీసీ ఉద్యోగి ఒకరు పాలుపంచుకున్నారని ఆరోపించింది. సదరు ఉద్యోగిని బీకేటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేదికి వ్యక్తిగత కార్యదర్శిగా ఆ సంస్థ పేర్కొంది. ఈ అవకతవకలను గతంలోనే ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చామని, ధ్రువీకరించడానికి సీసీటీవీ ఆరోపణలను ఫుటేజీని పరిశీలించాలని ఆలయ కమిటీని ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు సందీప్ ఖత్రి కమిటీని కోరారు. ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన హేమంత్ ద్వివేది.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న ఉద్యోగి తన వ్యక్తిగత కార్యదర్శి కాదని స్పష్టం చేశారు. “సంబంధిత ఉద్యోగి బద్రీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీలో రెగ్యులర్ ఉద్యోగి.. గతంలో ముగ్గురు చైర్ పర్సన్‌లకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు.. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆరోపణలు నిజమని తేలితే, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని ద్వివేది అన్నారు.

ఫిర్యాదు నేపథ్యంలో బద్రీనాథ్ ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినట్లు సీఈఓ రంగర్ తెలిపారు. ఫుటేజీలో ఆశించినంత స్పష్టత లేదని. అయినప్పటికీ, ఈ విషయం తీవ్రత, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, చైర్మన్‌కు సమాచారం అందించామని.. సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణ కోరుతామన్నారు సీఈఓ రంగర్. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా సమగ్ర విచారణ జరిపేందుకు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. విచారణలో ఏదైనా అవకతవకలు జరిగినట్టు వెల్లడయితే శ్రీ బద్రీనాథ్ – కేదార్నాథ్ ఆలయ కమిటీ చట్టం 1939.. వర్తించే సేవా నిబంధనల ప్రకారం చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రంగర్ తెలిపారు.

Also Read : మాకు భారత్ ఉంది.. అమెరికాకు ఇజ్రాయిల్ కౌంటర్..!

ప్రస్తుత చార్ ధామ్ యాత్ర సీజన్లో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు విరాళాల రూపంలో సుమారు రూ.70 కోట్లు అందినట్లు నిర్వాహకులు తెలిపారు. అతిథి గృహాల ద్వారా కూడా బీకేటీసీ ఆదాయం పొందుతుంది. వార్షిక విరాళాలు సగటున రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల మధ్య ఉంటాయి. ఈ మొత్తం యాత్రికుల సంఖ్య, వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకు సిబ్బంది సమక్షంలో నలుగురు లేదా ఐదుగురు బీకేటీసీ ఉద్యోగుల బృందం విరాళాలను లెక్కిస్తుంది. లెక్కింపు ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలనుకునే భక్తులను కూడా వారి గుర్తింపు పత్రాలను ధ్రువీక రించుకున్న తర్వాత పాల్గొనడానికి అనుమతిస్తారు. లెక్కింపు పూర్తయిన తర్వాత, విరాళాలను బ్యాంకు ఉద్యోగులకు అప్పగి స్తారు. ఓ వైపు అయోధ్య విరాళాల వివాదం జరుగుతున్న సమయంలోనే బద్రీనాథ్ ఆలయంలో దొంగతనం అనే మాట పెద్ద దుమారం రేపుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

కవిత కొత్త పార్టీకి...

కల్వకుంట్ల కవిత ఇటీవలే ప్రతిపాదించిన నూతన...

రివేంజ్ ట్రాన్స్‌ఫర్స్.. నిజమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పరిపాలనాపరమైన...

పోల్స్