Saturday, October 10, 2026 09:56 AM
Saturday, October 10, 2026 09:56 AM

రివేంజ్ ట్రాన్స్‌ఫర్స్.. నిజమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పరిపాలనాపరమైన బదిలీల నిర్ణయాలపైనా రాజకీయం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎన్ ప్రవీణ్ కుమార్ సతీమణి, సీనియర్ ప్రభుత్వ అధికారిణి లక్ష్మీబాయిని ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ పోస్టు నుండి సహకార శాఖ పరిధిలోని హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీ నేరుగా ముఖ్యమంత్రి చేయించారని.. కనీసం వాహన సౌకర్యం కూడా లేకుండా చేయాలనే కుట్రతోనే అప్రాధాన్య పోస్టుకు పంపారంటూ విమర్శలు ప్రారంభించారు.

Also Read : అన్నం తిన్న తర్వాత విపరీతమైన బద్ధకం, నీరసం వస్తున్నాయా..?

ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత సిబ్బందితో పాటు కారు సౌకర్యాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించి పాక్షిక ఉపశమనం పొందారు. అక్కడ రిలీఫ్ దక్కడంతో తట్టుకోలేకే, ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా భార్యను టార్గెట్ చేసిందని, రేవంత్ రెడ్డి హిట్లర్‌లా వ్యవహరిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపిస్తున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ భార్య అయినంత మాత్రాన ఆమెకు ఎప్పుడూ లూప్ లైన్ కాకుండా కేవలం ప్రాధాన్యత కలిగిన పోస్టులనే కేటాయించాలా అనే ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తోంది.

ఒక ప్రభుత్వ అధికారిగా నియమితులైనప్పుడు ఏ శాఖలోనైనా, ఏ బాధ్యతలనైనా నిర్వహించాల్సి ఉంటుంది. భర్త బీఆర్ఎస్‌లో ఉన్నారని చెప్పి, గతంలో అనుభవించిన అన్ని లగ్జరీలు, వాహన సౌకర్యాలు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకోవడం.. బదిలీ చేస్తేనే భయపడి వేధించినట్లు కలరింగ్ ఇవ్వడం విడ్డూరంగా ఉందనే కామెంట్లు వస్తున్నాయి. లక్ష్మీబాయిని ఉద్యోగం నుంచి తొలగించలేదు కదా, కేవలం ఒక విభాగం నుండి మరో విభాగానికి బదిలీ చేసిన దానికి ప్రభుత్వం భయపడిపోయింది అంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధమైన మైండ్ గేమ్స్, కక్షసాధింపు కార్డ్ ప్లే చేయడం ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేతలు విమర్శలపాలవుతున్నారు.

పరిపాలనలో బదిలీలు అనేవి ప్రభుత్వాల విచక్షణాధికారాలనే ప్రాథమిక నిజాన్ని ముందుగా తెలుసుకోవాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బదిలీలు చేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. తాము అన్నింటికీ తెగించిన తర్వాతే రాజకీయాల్లోకి అడుగు పెట్టామన్నారు కూడా. రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మొదట తన సెక్యూరిటీని తగ్గించారని.. ఇప్పుడు తన భార్యను బదిలీ చేశారని విమర్శించారు. తన సతీమణిని అన్యాయంగా టార్గెట్ చేసుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

Also Read : లోకేష్ మార్క్ మ్యాజిక్.. కార్పొరేట్‌ను తలదన్నుతున్న ప్రభుత్వ స్కూల్స్!

తన భార్యకు అసలు సంబంధం లేని వేరే డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేశారని మండిపడ్డారు. బెదిరింపులు, కక్షసాధింపు చర్యలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి నిత్యం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రతీ చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఆర్డరు కూడా రాజకీయ కోణంలోనే చూస్తూ, హిట్లర్ పాలన అంటూ పెద్ద పెద్ద పదాలతో బురదజల్లడం చూస్తుంటే.. ప్రభుత్వ పనితీరుపై అవగాహన లేమితో పాటు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే ఈ రకమైన రచ్చ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్