Wednesday, July 1, 2026 05:28 PM
Wednesday, July 1, 2026 05:28 PM

ముంబైకి హార్దిక్ పాండ్యా గుడ్‌బై.. ఇల్లు కూడా షిఫ్ట్..!

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన కెరీర్‌ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. దశాబ్ద కాలంగా ముంబైలో నివసిస్తున్న అతను.. ఇప్పుడు ముంబైని వదిలి శాశ్వతంగా బెంగళూరు నగరానికి తన కాపురాన్ని, కోచింగ్ సెంటర్ ను మార్చేశాడు. బెంగళూరు శివార్లలో అతను ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా క్రికెటర్లు గాయాల నుంచి కోలుకోవడానికి లేదా ఫిట్నెస్ క్యాంప్‌ల కోసమే బెంగళూరుకు వెళ్తుంటారు, కానీ కెరీర్ ముగిసే వరకు బెంగళూరులోనే ఉండి ప్రాక్టీస్ చేయాలని పాండ్యా నిర్ణయించుకోవడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.

Also Read : నాని అవుట్.. రోహిత్ ఇన్..!

హార్దిక్ పాండ్యా ముంబై వీడటానికి ప్రధాన కారణం అక్కడి ట్రాఫిక్ సమస్యలే అని తెలుస్తోంది. ముంబై లోని లోయర్ పరేల్‌ లో ఉన్న తన నివాసం నుండి ఘన్సోలిలో ఉన్న ముంబై ఇండియన్స్ అకాడమీకి శిక్షణ కోసం ప్రతిరోజూ ప్రయాణించడం అతనికి పెద్ద నరకంగా మారింది. ట్రాఫిక్ వల్ల సమయం వృధా కావడంతో పాటు ప్రాక్టీస్‌ పై దృష్టి పెట్టలేకపోయాడు. అందుకే, బీసీసీఐ నిర్మించిన అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు అత్యంత సమీపంలో ఉండేలా బెంగళూరు అవుట్‌ స్కర్ట్స్‌లో ఇల్లు తీసుకుని అక్కడే స్థిరపడ్డాడు.

Also Read : ఏపీ పెట్రోల్ బంకులపై సర్కార్ స్పెషల్ ఫోకస్..!

సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాడిగా హార్దిక్‌ కు బీసీసీఐ అకాడమీ లోని అన్ని వసతులను వాడుకునే పూర్తి హక్కు ఉంది. జాతీయ జట్టుకు ఆడని సమయంలో లేదా ఐపీఎల్ లేని రోజుల్లో ఆయన ఇక్కడే పర్మినెంట్‌ గా శిక్షణ పొందుతాడు. దీని కోసం అతను సొంత ఖర్చులతో పర్సనల్ ఫిజియో, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌ ను కూడా నియమించుకున్నాడు. ప్రస్తుతం క్వాడ్రిసెప్స్ గాయంతో బాధపడుతున్న హార్దిక్.. యూకే టూర్‌ కు దూరమై ఇక్కడే కోలుకుంటున్నాడు. మరో 5 నుండి 6 ఏళ్ల పాటు వైట్ బాల్ క్రికెట్ ఆడాలనే పట్టుదలతో ఉన్న పాండ్యా.. ఈ సరికొత్త ప్లాన్‌ తో బెంగళూరు నుంచే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తమిళ రాజకీయాల్లో సంచలనం.....

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ...

ఏపీ పెట్రోల్ బంకులపై...

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో అవినీతిని అంతమొందించేందుకు,...

నాని అవుట్.. రోహిత్...

ఏపీలో ఎన్నికలు ఇంకా మూడేళ్ల సమయం...

సునీల్ కుమార్ రిటైర్మెంట్...

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌ కు చెందిన వివాదాస్పద,...

దువ్వాడ మిస్సింగ్.. దివ్వెల...

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్...

2018 గ్రూప్ వన్...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పులకు...

పోల్స్