వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పులకు షాక్ ఇవ్వటంలో చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యారనేది వాస్తవం. అయితే ఈ ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్. సీఎం చంద్రబాబు చేయలేని గ్రూప్ వన్ అధికారుల ఎంపిక రద్దును.. హైకోర్టు డివిజన్ బెంచి రద్దు చేస్తుందేమో..? తమకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందేమో అని.. 2018 గ్రూప్ వన్‌కు ఎంపికైన అధికారులందరు టెన్షన్‌తో భయపడుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన గ్రూప్ వన్ అధికారుల ఎంపికలను రద్దు చేయలేని పరిస్థితిలో సీఎం చంద్రబాబు ఏయే కారణాలతో ఉన్నారో..? మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : సునీల్ కుమార్ కేసు.. రంగంలోకి ఏజీ..?
అసలు విషయం ఏమిటంటే.. 2018 గ్రూప్ వన్ అధికారుల ఎంపికలో వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ వన్ అధికారుల ఎంపికను రద్దు చేస్తామని 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అర్హులైన వారికి కాకుండా.. తమకు అనుకూలమైన వారికే ఎక్కువకై వైసీపీ సర్కార్‌లో గ్రూప్ వన్ పోస్టులు వచ్చాయనేది టీడీపీ, జనసేన నేతలతో పాటు గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా ఆరోపణలు చేశారు. దీంతో బాధితులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి అయ్యింది. అయినా కూడా ఆ హామీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అప్పటి గ్రూప్ వన్ రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినా కూడా.. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేసి.. తమకు అన్యాయం చేశారని కొందరు కోర్టుకు వెళ్లటంతో అప్పటి గ్రూప్ వన్ అధికారుల ఎంపికలను కోర్టు తప్పు పట్టి రద్దు చేసింది. దీంతో గ్రూప్ వన్ అధికారులు డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. కోర్టులో ఈ కేసు ఫైనల్ విచారణ పూర్తి అయ్యి, తీర్పు వచ్చే అవకాశం ఉందా..? మరి కొంత సమయం తీసుకుంటుందా..? వేచి చూడాల్సిందే.
Also Read : టాటా సియెర్రా ఈవీ రేంజ్ మామూలుగా లేదుగా..!
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. 2018 గ్రూప్ వన్‌లో ఎంపికైన వారిలో చాలా మందిని పోకల్ పోస్టులైన డిప్యూటీ కలెక్టర్‌లుగా, డీఎస్పీలుగా నియమించటంపై న్యాయస్థానం కూడా తప్పు పట్టింది. దీంతో వారందరిని నాన్ పోకల్ పోస్టుల్లో నియమించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయకుండా, కూటమి ప్రభుత్వం కూడా తప్పులు చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ అయిన రిటైర్డు ఐపీఎస్ అధికారి పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీఎం చంద్రబాబు మెతక వైఖరిని పలువురు తప్పుపట్టారు కూడా. గ్రూప్ వన్ అధికారుల ఎంపికను రద్దు చేస్తామన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌లలో ఏ ఒక్కరు కూడా ఆ విషయంపై ఇప్పుడు స్పందించటం లేదంటే.. అప్పటి గ్రూప్ వన్ ఎంపికలను పరోక్షంగా సమర్థించినట్లే అని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా, జరిగిన అవకతవకలు అన్నీ తెలిసి కూడా కూటమి ప్రభుత్వ పాలకులు తాము గతంలో ఇచ్చిన హామీని మరిచిపోయి, అప్రతిష్టను మూట గట్టుకుంటున్నారు.

