అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తో మళ్ళీ ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలను నిరోధించేందుకు అమెరికా సెనేట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా యుద్ధానికి వెళ్లకుండా, ఆయన సైనిక అధికారాలను కట్టడి చేస్తూ సెనేట్ ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించింది. ఈ కొత్త తీర్మానం ప్రకారం.. అమెరికా పార్లమెంట్ ముందస్తు అనుమతి లేదా అధికారిక ప్రకటన లేకుండా ఇరాన్ పై డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదు.
Also Read : రేవంత్ సర్కార్ దెబ్బకు దిగి వచ్చిన ఎస్బీఐ..!
ఒకవేళ ఇరాన్ నుంచి అమెరికాకు తక్షణ ముప్పు ఉంటే తప్ప, మిగిలిన ఏ సందర్భంలోనైనా యుద్ధానికి వెళ్లాలంటే ప్రజాప్రతినిధుల ఆమోదం ఖచ్చితంగా ఉండాల్సిందేనని సెనేట్ స్పష్టం చేసింది. ఇరాన్ తో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా చూసేందుకు.. అక్కడ మోహరించిన అమెరికా సైనిక బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సెనేట్ ఈ ఉమ్మడి తీర్మానంలో పేర్కొంది. శత్రుత్వాలను పక్కన పెట్టి దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.
Also Read : కిమ్ జోంగ్ ఉన్ మెంటల్ మాస్ నిర్ణయం..!
సెనేట్ తీసుకున్న ఈ నిర్ణయంపై వైట్ హౌస్ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ తీర్మానం అమెరికా రక్షణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని ట్రంప్ అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెనేట్ ఆమోదించిన ఈ బిల్లును ప్రెసిడెంట్ ట్రంప్ తన ప్రత్యేక వీటో అధికారంతో తిరస్కరించే అవకాశం ఉందనే చర్చ కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో నడుస్తోంది. ఐదు నెలలుగా సాగుతున్న ఈ యుద్ధానికి 80 బిలియన్ డాలర్ల ఖర్చు కానుండగా, స్విట్జర్లాండ్ చర్చలపై, ట్రంప్ నిర్ణయాధికారంపై ఈ చారిత్రాత్మక ఓటింగ్ ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

