Monday, June 22, 2026 02:45 PM
Monday, June 22, 2026 02:45 PM

టెస్ట్ క్రికెట్ పై కోహ్లీ సంచలన కామెంట్..!

భారత స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ పునరాగమనంపై వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరదించాడు. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియా వేదికగా తాను మళ్లీ రెడ్ బాల్ క్రికెట్‌ లోకి అడుగుపెట్టబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అతను తీవ్రంగా ఖండించాడు. వన్ 8 కార్యక్రమంలో హోస్ట్ డానిష్ సైత్ అడిగిన ప్రశ్నకు కోహ్లీ సమాధానమిస్తూ.. “నా టెస్ట్ కెరీర్ ముగిసింది, థాంక్యూ ” అని స్పష్టం చేస్తూ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు.

Also Read : బిజేపిలో ఏం జరుగుతోంది..? రాజనాథ్ ఇంట్లో కీలక భేటీ..!

కోహ్లీ టెస్ట్ రీఎంట్రీపై రూమర్స్ రావడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఇటీవలే తన చిన్ననాటి కోచ్ రాజ్‌ కుమార్ శర్మకు టెస్ట్ క్రికెట్ థీమ్‌ తో కూడిన రెడ్ షూస్‌ ను బహుమతిగా ఇచ్చాడు. దీనిపై కోచ్ స్పందిస్తూ.. “మేము దీని గురించి మాట్లాడుకుంటున్నాం, ఏం జరుగుతుందో చూద్దాం” అని హింట్ ఇచ్చాడు. అంతేకాకుండా, రవిశాస్త్రితో కలిసి చేసిన ఒక పాడ్‌ కాస్ట్‌ లో కోహ్లీ సంప్రదాయ టెస్ట్ జెర్సీని పోలిన స్వెటర్ ధరించడం, సదరు కొత్త షూస్ ధర కూడా కోహ్లీ టెస్ట్ పరుగులకు సమానంగా ఉండటంతో ఫ్యాన్స్.. కోహ్లీ మళ్లీ టెస్టులు ఆడబోతున్నాడని గట్టిగా నమ్మారు.

Also Read : రూపాయి పతనం.. వీసా కష్టాలు.. విదేశీ విద్య ఇంత దారుణమా..?

కానీ కోహ్లీ ఈ విషయాలన్నింటినీ కేవలం యాదృచ్ఛికమేనని కొట్టిపారేశాడు. విరాట్ కోహ్లీ మే 2025లో టెస్ట్ క్రికెట్‌ కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన అద్భుతమైన టెస్ట్ కెరీర్‌ లో 123 మ్యాచ్‌ లు ఆడి 46.85 సగటుతో 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీల సహాయంతో మొత్తం 9,230 పరుగులు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌ కు దూరం కానున్నట్లు తేల్చి చెప్పిన కోహ్లీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌ లో మాత్రం కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026 లో ఆర్సీబీ తరఫున 675 పరుగులు చేసి టైటిల్ అందించిన కోహ్లీ, త్వరలో ఇంగ్లాండ్‌ తో జరగబోయే వన్డే సిరీస్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే గాయం కారణంగా జూన్ 22న జరిగే ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయిన తర్వాతే ఆయన తుది జట్టులో ఆడనున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయి విషయంలో డ్యూయల్...

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక...

గ్లాసుతో ప్రేమలో పడ్డ...

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే గ్రేటర్...

సాయి కృష్ణ కేసులో...

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో...

పవన్ కు ఆ...

ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్...

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

పోల్స్