Friday, September 18, 2026 08:16 AM
Friday, September 18, 2026 08:16 AM

ఇంటర్వ్యూల దెబ్బకు స్టార్ హీరో హడల్..!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు బీ టౌన్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. మోస్ట్ అవేటెడ్ మూవీ డాన్ 3 ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న వివాదాలు, ఊహాగానాలపై ఆయన పూర్తి మౌనం వహించాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం సర్దుమణిగే వరకు, అంటే రాబోయే 18 నెలల పాటు ఎలాంటి మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవలే రణవీర్ సింగ్‌ ను వ్యక్తిగతంగా కలిసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read : వెంకి, కళ్యాణ్ రామ్ లతో హిట్ మెషిన్ అనిల్ రావిపూడి సిద్ధం..!

డాన్ 3 వివాదంపై తాను స్వయంగా గానీ, లేదా తన పీఆర్, లీగల్ టీమ్స్ ద్వారా గానీ ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయబోనని రణవీర్ స్పష్టం చేసినట్లు సదరు జర్నలిస్ట్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తన వద్దకు వచ్చిన అన్ని ఇంటర్వ్యూ రిక్వెస్టులను హోల్డ్‌ లో పెట్టారని, దర్శకుడు జయ్ మెహతా ప్రాజెక్ట్ ప్రళయ్ విడుదలయ్యే వరకు ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Also Read : నల్లపరెడ్డికి చుక్కలు చూపించిన ఆడపులి..!

మరోవైపు, ఈ సినిమా అప్డేట్స్‌ పై నెలకొన్న సందిగ్ధత కారణంగా రణవీర్ సింగ్‌ కు, డాన్ 3 నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే, రణవీర్‌ తో మంచి అనుబంధం ఉన్న దర్శకురాలు జోయా అక్తర్ జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని సర్దుమణిగేలా చేస్తారని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తలపై అటు రణవీర్ సింగ్ కానీ, ఇటు డాన్ 3 చిత్ర బృందం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్