Thursday, September 17, 2026 11:38 PM
Thursday, September 17, 2026 11:38 PM

ఎల్జీ బాధితులను జగన్ వదిలేశారు.. బాబు ఆదుకున్నారు

వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదంపై వైసీపీ చేస్తున్న రాజకీయాలతో.. ఎల్జీ పాలిమర్స్ బాధితుల విషయంలో గతంలో ఫ్యాన్ పార్టీ వ్యవహరించిన తీరును స్థానికులు గుర్తు చేసుకొంటున్నారు. 2020 మేలో విశాఖ నగరంలోని ఎల్జీ పాలిమర్స్‌ ప్లాంట్‌ నుంచి ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ లీకైన దుర్ఘటనలో 15 మంది చనిపోయారు. విష వాయువు పీల్చి ఆరు వేల మందికి పైగా అనారోగ్యం పాలయ్యారు. అప్పట్లో జగన్‌ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించింది గానీ.. మిగిలిన బాధితులను పట్టించుకోలేదు. వేలాది మందికి కనీస పరిహారం అందలేదు. అనారోగ్యం పాలై.. పనులు చేసుకోలేక.. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి గాలికి వదిలేశారు.

Also Read : స్టీల్ ప్లాంట్.. నిర్లక్ష్యంతో బూడిదవుతున్న కార్మికులు..!

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్‌ బాధితులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా జగన్‌ సర్కారు కనికరించలేదు. పైగా ఆందోళన చేస్తున్న బాధితుల మీదే కేసులు పెట్టి వేధించిన ఘనత వైసీపీ సొంతం. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు బాధితుల ఆవేదన అర్ధం చేసుకొని.. మరో 120 కోట్ల రూపాయల అదనపు పరిహారం చెల్లించేలా.. ఎల్జీ పాలిమర్స్‌ యాజమన్యాన్ని ఒప్పించారు.

ఈ 120 కోట్లలో బాధితులకు నేరుగా పరిహారం చెల్లించేందుకు 60 కోట్లు కేటాయించగా.. గ్యాస్‌ లీక్‌తో ప్రభావితమైన కాలనీల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు, రక్షిత తాగు నీటి సరఫరా, పర్యావరణాన్ని మెరుగు పరచడానికి మిగిలిన 60 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అప్పట్లో మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్న వైసీపీ.. ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ బాధితులను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా.. ఫేక్ ప్రచారాలు చేస్తోంది.

Also Read : విశాఖ KGHకు లోకేష్‌.. స్టీల్‌ ప్లాంట్ ప్రమాద బాధితులకు భరోసా..!

అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా బాధితులకు అండగా నిలిచి వారిని ఆదుకోవడం కనీస మానవత్వం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదంపై వెంటనే స్పందించిన కూటమి ప్రభుత్వం భాధితులకు ఆర్దిక సాయం ప్రకటించడంతో పాటు వారి కుటుంబాలకు అండగా నిలిచింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ స్వయంగా వైజాగ్‌ వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను.. ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. ఇదే సమయంలో వైసీపీ మాత్రం మీడియా ఉంది కదా అని పేటీఎం బ్యాచ్‌తో పొలిటికల్ పాయింట్లు స్కోర్ చేయడంలో బీజీ అయిపోయింది. ఎవరు ప్రజల కోసం పని చేస్తున్నారో.. ఎవరు స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్