Tuesday, June 9, 2026 08:48 PM
Tuesday, June 9, 2026 08:48 PM

రెండు పదవులు చాలవా.. మరో పదవి కావాలా..!

ఆ నేతల ఇంట్లో రెండు పదవులు ఉన్నా కూడా.. మూడో పదవి కోసం ఇంకా ఆరాట పడుతున్నారు. ఒకప్పుడు టీడీపీలో జోడు పదవులు వద్దు.. ఒకరికి ఒకే పోస్టు ముద్దు.. అనే విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఇంటికి ఒక పోస్టు అనే విధానాన్ని కఠినంగా అమలు చేయకుంటే.. ముందుంది ముసళ్ల పండుగ అనే సామెత నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అలకలు, అసంతృప్తులు, పరోక్షంగా విమర్శలు, ఆరోపణలు మరింత ముదురే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయంలో ఒకే కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కలిగినా కూడా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదేమో..!

Also Read : విశాఖ KGHకు లోకేష్‌.. స్టీల్‌ ప్లాంట్ ప్రమాద బాధితులకు భరోసా..!

తాజాగా రాజ్యసభ సిటు ఆశించిన టీడీపీ నాయకులు ఆ అవకాశం లభించక పోవటంతో తమకేదో అన్యాయం జరిగిందని, చంద్రబాబు మాట తప్పారని చిరు, బురులాడుతున్నారు. అలాంటి వారిలో వర్ల రామయ్య, శ్రీనివాస్ రెడ్డి మాత్రమే ఇప్పటి వరకు బయటపడ్డారు. తమకేదో అన్యాయం జరిగిందని కూడా అంటున్నారు. ఈ ఇద్దరికి అన్యాయం ఎలా జరిగిందనే విషయం బయటకు చెప్పరు. కారణం వారికి అన్యాయం కన్నా, న్యాయమే ఎక్కువ జరిగిందన్న కామెంట్లు విన్పిస్తున్నాయి. వర్ల రామయ్య కుమారుడు పామూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక రామయ్య కూడా పాలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. అయినా ఆయన తృప్తి పడకుండా.. చంద్రబాబు తనకు అన్యాయం చేశారని నిస్టూరం ఆడుతున్నారట.

Also Read : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం..!

నిజానికి వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు ఇంత వరకూ ఎప్పుడూ చెప్పలేదు. 2018లో మాత్రం.. రాజ్యసభకు రామయ్య పేరు అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు బదులుగా సీఎం రమేష్‌ను పెద్దల సభకు పంపారు. ఆ తర్వాత మళ్లీ పత్రికల్లో రావడమే తప్ప.. చంద్రబాబు ఒక్కసారి కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అదే విధంగా కడపకు చెందిన శ్రీనివాసరెడ్డి కూడా తనకు కూడా అన్యాయం జరిగిందంటున్నారు. నిజానికి ఆయన భార్య రెడ్డివారి మాధవీ రెడ్డి ప్రస్తుతం కడప ఎమ్మెల్యే. ఆయన గతంలో పాలిట్ బ్యూరో సభ్యుని పదవిలో ఉన్నారు. ఇప్పుడు రెండు జిల్లాలకు ఇన్‌ఛార్జ్ కూడా. అయినా సరే.. ఆయనకు ఇంకా తృప్తి కలగలేదు. రాజ్యసభ సిటు ఆశించారు. ఆ పదవి దక్కకపోవటంతో చంద్రబాబుపై పరోక్షంగా కామెంట్లు చేశారు కూడా. ఇప్పటికే వర్ల రామయ్య, శ్రీనివాసరెడ్డి కుటుంబాలకు రెండేసి పదవులు దక్కినా కూడా ఇంకా అసంతృప్తే.. పదవులు దక్కని వారు అసంతృప్తి గా ఉన్నారంటే అదివేరు. ఇంట్లో రెండేసి పదవులు ఉన్న వారికి కూడా, మూడో పదవి ఇవ్వలేదని బాధ ఎందుకో.. ఎవరికీ అర్థం కావటం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విశాఖ KGHకు లోకేష్‌.....

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర...

నా పేరు వాడుకోవద్దు...

తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో...

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో...

విశాఖపట్నంలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం...

రెండేళ్ల పాలనపై సర్వే.....

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన...

విద్యార్థుల కోసం సర్కార్...

రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో ఉచిత...

టీడీపీలో రాజ్యసభ రచ్చ..!

రాజ్యసభ సభ్యుల ఎంపిక తెలుగుదేశం పార్టీలో...

పోల్స్