Friday, September 18, 2026 06:30 AM
Friday, September 18, 2026 06:30 AM

ప్లీజ్.. నన్ను మన్నించండి..!

బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేశ్‌ దేశ్‌ముఖ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాజా శివాజీ’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ పార్టీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వివాదం చెలరేగింది. ఆ వీడియోలో రితేశ్‌.. ఛత్రపతి శివాజీ ఫొటో ఉన్న టీ షర్ట్ ధరించి డ్యాన్స్ చేయడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో పాటు, గొప్ప సినిమా తీసి దాని సక్సెస్‌ పార్టీలో మద్యం తీసుకొని డాన్స్‌ వేశారంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపై రితేశ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

Also Read :

‘‘ఇటీవల విడుదలైన ‘రాజా శివాజీ’ సినిమాకు ప్రేక్షకులు అందించిన అపూర్వమైన ఆదరణను సెలబ్రేట్ చేసుకోవడానికి మేమంతా చిన్న వేడుక ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక శివాజీ భక్తుడిగా దీనిపై స్పష్టత ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫొటో ఉన్న టీ షర్ట్ ధరించి వేడుక చేసుకోవడం వెనుక, ఆయనను అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం నేను ఆ టీ షర్ట్‌ ధరిస్తున్నాను. ఆ రోజు కూడా ప్రమోషన్స్ ముగించుకుని నేరుగా ఈ ఈవెంట్‌కు వెళ్లాను. దీంతో నాకు డ్రెస్‌ మార్చుకునే సమయం లేదు. ఇక మద్యం తీసుకున్నానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ మద్యం తీసుకోలేదు. భవిష్యత్తులోనూ ఎప్పటికీ ముట్టను’’ అని స్పష్టంచేశారు.

Also Read :

తనవల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించమని కోరారు. ఛత్రపతి శివాజీ అంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు. రితేశ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా శివాజీ’ చిత్రం మరాఠీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. రూ.117.41 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో జెనీలియా, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా, సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్