ప్రముఖ లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లోకి సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ బైక్ ను లాంచ్ చేసింది. తన 2026 అన్ లీష్డ్ క్యాంపెయిన్ లో భాగంగా స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్‌ఎక్స్ మోడల్ ను అధికారికంగా విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం ఈ పవర్ ఫుల్ రేస్ బైక్ ధరను రూ. 13.91 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్‌ఎస్ మోడల్ కు ఇది మరింత అప్ గ్రేడెడ్, పూర్తి ట్రాక్-ఓరియెంటెడ్ వెర్షన్ గా రాబోతోంది.
Also Read : అసలు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ గోల ఏమిటీ..!
సాధారణ మోడళ్లతో పోలిస్తే ఈ ఆర్‌ఎక్స్ వేరియంట్ లో హార్డ్ వేర్, స్టైలింగ్ పరంగా కంపెనీ కీలక మార్పులు చేసింది. బైక్ హ్యాండ్లింగ్ మరింత షార్ప్ గా ఉండటం కోసం దీనికి సరికొత్త క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అమర్చారు. దీనివల్ల రైడింగ్ పొజిషన్ కాస్త కిందకు తగ్గి, బైకర్లకు మరింత అగ్రెసివ్ రైడింగ్ స్టాన్స్ లభిస్తుంది. లుక్ పరంగా ఇది సిల్వర్ కలర్ పెయింట్ స్కీమ్, రెడ్ కలర్ సబ్ ఫ్రేమ్, వీల్స్ పై పిన్ స్ట్రైప్స్ తో స్పోర్టీ లుక్ ను కలిగి ఉంది. ఈ ప్రీమియం బైక్ లో సాంకేతికంగా బలమైన 765సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్ లైన్ ట్రిపుల్ ఇంజన్ ను వాడారు.
Also Read : కలవరపెడుతున్న రోహిత్ ఫిట్‌నెస్..!
ఇది 12,000 ఆర్పీఎమ్ వద్ద 130 హార్స్ పవర్, 9,500 ఆర్పీఎమ్ వద్ద 80 ఎన్ఎమ్ టాప్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్, మల్టీ క్విక్‌షిఫ్టర్‌తో వస్తుంది. బైక్ ముందు భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ 41 ఎంఎం ఓహ్లిన్స్ ఫోర్క్స్, వెనుక వైపు ఓహ్లిన్స్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ట్విన్ 310ఎంఎం ఫ్లోటింగ్ ఫ్రంట్ డిస్క్ లతో కూడిన బ్రెంబో స్టైల్మా కాలిపర్స్, గ్రిప్ కోసం పిరెల్లి డయాబ్లో సూపర్ కార్సా టైర్లను ఉపయోగించారు. సాధారణ ఆర్‌ఎస్ మోడల్ ధర రూ. 12.93 లక్షలుగా ఉండగా, ఈ లిమిటెడ్ ఆర్‌ఎక్స్ ఎడిషన్ దానికంటే దాదాపు రూ. లక్ష వరకు ఎక్కువ.

