Saturday, August 22, 2026 06:54 AM
Saturday, August 22, 2026 06:54 AM

మెగా 158 కోసం రంగంలోకి ‘జైలర్’..!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రం గురించి వరుస అప్‌డేట్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఈ నెల‌ 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక కీలక ప్రకటన చేసింది. ‘జైలర్’, ‘డాకు మహరాజ్’ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విజయ్ పుట్టినరోజున ఈ ప్రకటన చేయడం విశేషం. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు.

Also Read : బెంగాల్‌లో బుల్‌డోజర్లు.. సువేందు భారీ ఆపరేషన్..!

ఇటీవల ఆయన జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ప్రతిరోజూ పరిమితులను అధిగమించడానికి ఒక కొత్త అవకాశం. #Mega158 కోసం నా ప్రియమైన బాబీతో మరో గుర్తుండిపోయే ప్రయాణానికి ఉత్సాహంగా, సిద్ధంగా ఉన్నాను. మే 21న ప్రారంభోత్సవం” అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం చిరంజీవి ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటూ తన శరీరాకృతిని మార్చుకుంటున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. గతంలో చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమాను ప్రకటించారు. అప్పుడు విడుదల చేసిన పోస్టర్‌లో గోడను చీలుస్తున్న గొడ్డలి, రక్తపు మరకలతో పాటు ‘ది బ్లేడ్ దట్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.

Also Read : కులగణ జరగాల్సిందే.. సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్..!

ప్రముఖ‌ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మాస్ ఎంటర్‌టైనర్‌కు తమన్ అదిరిపోయే బాణీలు అందించనున్నారని వెల్లడించారు. మెగాస్టార్ మాస్ ఎలివేషన్లకు, డ్యాన్సులకు తగ్గట్టుగా పక్కా లోకల్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇవ్వడంలో తమన్ సిద్ధహస్తుడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో #Mega158పై ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

కొండా సురేఖ పై...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబం...

మాట జాగ్రత్త.. పార్టీ...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు...

పోల్స్