Saturday, September 26, 2026 02:45 PM
Saturday, September 26, 2026 02:45 PM

గేమ్ ఆడుతున్న పాక్.. అమెరికా చేతిలో షాక్ తప్పదా..?

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో పాకిస్థాన్ పోషిస్తున్న పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుండగా, మరోవైపు ఇరాన్ సైనిక విమానాలు కీలక స్థావరాలకు చేరుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్ పౌర విమానం ఒకటి ఆఫ్ఘనిస్థాన్‌ లోని కాబూల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు సమాచారం.

Also Read : బ్రేకింగ్: బిజేపికి షాక్ ఇచ్చిన అన్నాడిఎంకే..!

యుద్ధం ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే ఈ పరిణామం చోటుచేసుకుందని ఆఫ్ఘన్ పౌర విమానయాన అధికారి ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించినట్లు సమాచారం. పౌర విమానంగా చెబుతున్నప్పటికీ, దీని వెనుక సైనిక వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్థాన్ ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నా, లోలోపల ఇరాన్‌ కు సహకరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. కీలక వైమానిక స్థావరాల వద్ద ఇరాన్ కదలికలకు పాక్ పరోక్షంగా సాయం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : ప్రపంచస్థాయి “మైస్” కేంద్రంగా ఆంధ్రప్రదేశ్

అయితే, ఒక సీనియర్ పాకిస్థానీ అధికారి ఈ వాదనలను తీవ్రంగా తోసిపుచ్చారు. తమకు ఎవరితోనూ సంబంధం లేదని, ప్రాంతీయ శాంతి కోసమే ప్రయత్నిస్తున్నామని వారు చెబుతున్నారు. అమెరికా హెచ్చరికలు, ఇరాన్ దూకుడు మధ్య పాకిస్థాన్ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందా..? లేక నిజంగానే శాంతి కోసం ప్రయత్నిస్తోందా..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాబూల్‌లో ఇరాన్ విమానం ల్యాండింగ్ ఘటన మాత్రం మరిన్ని అంతర్జాతీయ చిక్కులకు దారితీసేలా కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

3,677 ఉద్యోగాలు.. మాయమైన...

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న DSC...

పోల్స్