Wednesday, August 5, 2026 11:34 AM
Wednesday, August 5, 2026 11:34 AM

భారత్ ఫై నేపాల్ ను రెచ్చగొడుతున్న చైనా..!

భారత్ మరియు నేపాల్ మధ్య దశాబ్దాలుగా ఉన్న మైత్రికి సరిహద్దు వివాదం సవాల్ విసురుతోంది. కైలాస మానస సరోవర యాత్ర కోసం ఉత్తరాఖండ్‌ లోని లిపులేఖ్ పాస్ వరకు భారత్ నిర్మించిన వ్యూహాత్మక రోడ్డు ఇప్పుడు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన యుద్ధానికి దారితీసింది. ఆ భూభాగం మాదే అంటూ నేపాల్ కొత్త మ్యాప్‌లను తెరపైకి తేవడం వెనుక చైనా హస్తం ఉందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌ లోని ధార్చులా నుండి లిపులేఖ్ వరకు భారత్ 80 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించింది.

Also Read : ఓటమి దిశగా ముగ్గురు సీఎంలు..!

దీనివల్ల యాత్రికులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, చైనా సరిహద్దుల్లో భారత సైనిక కదలికలు మరింత సులభతరం అయ్యాయి. అయితే, ఈ ప్రాంతం తమదేనని, 1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారం లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు తమ భూభాగంలోకి వస్తాయని నేపాల్ వాదిస్తోంది. నేపాల్ వాదనలను భారత విదేశాంగ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది. ఈ ప్రాంతం ఎప్పటి నుంచో భారత్ ఆధీనంలోనే ఉందని, చారిత్రక ఆధారాలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

Also Read : మద్యానికి బానిసైన జాన్వీ కపూర్..?

నేపాల్ అకస్మాత్తుగా తన రాజకీయ మ్యాప్‌ ను సవరించి, భారత భూభాగాలను తనవిగా చూపించుకోవడాన్ని భారత్ కృత్రిమ విస్తరణగా అభివర్ణించింది. 1962 యుద్ధం నుండి భారత ఐటీబీపీ బలగాలు ఇక్కడే పహారా కాస్తున్నాయని, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని భారత్ సూటిగా ప్రశ్నిస్తోంది. నేపాల్ ఇంత దూకుడుగా వ్యవహరించడం వెనుక చైనా ప్రోద్బలం ఉందనేది బహిరంగ రహస్యం. నేపాల్‌ లో చైనా పెట్టుబడులు పెరగడం, అక్కడి కమ్యూనిస్ట్ పార్టీ నేతలపై బీజింగ్ పట్టు సాధించడమే ఈ మార్పుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. హిమాలయాల్లో భారత్‌ను అన్ని వైపుల నుండి ఇబ్బంది పెట్టాలని చూస్తున్న చైనా, నేపాల్‌ను ఒక పావుగా వాడుకుంటోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

పోల్స్