Sunday, June 21, 2026 03:44 AM
Sunday, June 21, 2026 03:44 AM

కల్కి 2898 ఏడీ సీక్వెల్ షురూ.. మే 4 నుంచే ప్రభాస్ ఎంట్రీ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ అద్భుతానికి కొనసాగింపుగా రాబోతున్న సీక్వెల్ కల్కి 2 పనులు వేగం పుంజుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేటి నుంచే ప్రారంభమైంది. హైదరాబాద్‌ లో వేసిన ఒక భారీ సెట్‌ లో ఈ చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ లో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు.

Also Read : పెట్రోల్ బంకుల్లో కొత్త మోసాలు.. హైదరాబాద్ లో ఆ బంకులో జాగ్రత్త..!

మే 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రభాస్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రించనున్నారు. మొదటి భాగంలో కర్ణ, భైరవ పాత్రల్లో మెప్పించిన ప్రభాస్, ఈ సీక్వెల్‌ లో మరింత పవర్‌ఫుల్ లుక్‌ లో కనిపించబోతున్నాడట. వైజయంతి మూవీస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌ తో ఈ విజువల్ వండర్‌ ను నిర్మిస్తోంది. రెండో భాగంలో అసలైన మ్యాజిక్ ఉండబోతోందని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Also Read : టీటీడీకి పవన్ లేఖ.. నానా పాట్లు పడుతున్న వైసీపీ..!

రెండో భాగంలో సుప్రీం యాస్కిన్ నేరుగా భైరవ లేదా కర్ణతో తలపడే సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో కొన్ని షూట్ చేయబోతున్నారని టాక్. మొదటి భాగం చివర్లో కర్ణ ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లాయి. సీక్వెల్‌ లో ఈ పాత్ర ఫ్లాష్ బ్యాక్ మరియు పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌ లకు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోంది. మొదటి భాగం కంటే కూడా సెకండ్ పార్ట్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ మరింత రియలిస్టిక్ గా ఉండటానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో షూటింగ్ జరుగుతోంది. సీక్వెల్‌లో మరికొందరు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ లేదా కీలక పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్