Sunday, June 21, 2026 02:48 AM
Sunday, June 21, 2026 02:48 AM

బాలయ్య-కొరటాల క్రేజీ అప్డేట్.. పవర్‌ఫుల్ మాఫియా డాన్ గా బాలయ్య..!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో నందమూరి నట సింహం బాలకృష్ణ, సెన్సిబుల్ డైరెక్టర్ కొరటాల శివ ప్రాజెక్ట్ ఒకటి. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబును కొరటాల మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌ లో చూపించబోతున్నట్లు సమాచారం.

Also Read : కాళేశ్వరంపై పట్టు వదలని రేవంత్.. కీలక సమావేశం..!

ప్రస్తుతం వినిపిస్తున్న లీకుల ప్రకారం.. ఈ సినిమాకు సెకండ్ హాఫ్ హైలైట్‌ గా నిలవబోతోంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే ఒక భారీ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అని టాక్. ఈ ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్‌ లో బాలయ్య ఒక పవర్‌ ఫుల్ మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నారట. మాఫియా సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన ఒక పవర్ హౌస్ గా, బాలయ్య మార్క్ డైలాగులు మరియు యాక్షన్ ఈ ఎపిసోడ్‌ లో పీక్స్‌ లో ఉంటాయని టాక్.

Also Read : జన సైనికులను రెచ్చగొడుతున్నారా..?

మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే వ్యక్తి, కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల ఆ లోకాన్ని వదిలి బయటకు రావాల్సి రావడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలు సినిమాను కీలక మలుపు తిప్పుతాయని సమాచారం. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌ కు తగ్గట్టుగా కొరటాల శివ ఈ మాఫియా డాన్ పాత్రను చాలా పవర్‌ ఫుల్‌ గా డిజైన్ చేశారట. సాధారణంగా కొరటాల సినిమాల్లో బలమైన సోషల్ మెసేజ్ ఉంటుంది, దానికి బాలయ్య మాస్ ఇమేజ్‌ ను తోడు చేసి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని చెప్పవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్