Saturday, April 11, 2026 06:54 PM
Saturday, April 11, 2026 06:54 PM

మ్యారేజ్ సర్టిఫికెట్ వల్ల ఉపయోగాలేంటి..?

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలనే విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. కానీ నిపుణులు మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్ పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్లు ఇతరత్రా అవసరాలకు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ.. చివరికి సర్టిఫికెట్ కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది.

Also Read : వైజాగ్: నెక్స్ట్ సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా

పాస్ పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి వీసా ప్రాసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం అయితే గ్రామ సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయం, పట్టణం అయితే వార్డు సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం, కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి.

Also Read : బ్రేకింగ్: డిజిటల్ పేమెంట్స్‌ పై ఆర్బీఐ కీలక నిర్ణయం..!

పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవ వధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్సులను గ్రామ, వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయం, మునిసిపల్ కార్యాలయంలో అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు, ఫొటోలు, సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేసీఆర్ యుద్ధం షురూ.....

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాల దిశగా...

ఆర్టీసీ ఉద్యోగుల కోసం...

ఈ మధ్య కాలంలో గుండెపోటు అనే...

వైసీపీపై షర్మిల విశ్వరూపం.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

దేశ చరిత్రలోనే తొలిసారి.....

భారత ఎన్నికల వ్యవస్థలో విమర్శలకు వేదికగా...

బీ అలర్ట్.. మెయిన్...

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ...

బ్రేకింగ్: సింగర్ మంగ్లీపై...

ప్రముఖ గాయని మంగ్లీ మరో వివాదంలో...

పోల్స్