Friday, April 10, 2026 08:40 PM
Friday, April 10, 2026 08:40 PM

గర్భిణీ స్త్రీలు వాము తింటున్నారా..?

చాలా మందికి.. సాధారణంగా భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు నమలడం అలవాటు. అయితే, కేవలం సోంపు మాత్రమే కాదు.. మరో రెండు రకాల గింజలను కూడా కలిపి తీసుకుంటే జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వత్స సూచిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత సోంపు, వాము, జీలకర్రలను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆయన చెబుతున్నారు.

Also Read : సోషల్ మీడియాపై లోకేష్ కీలక ఆదేశాలు..!

భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల నోరు తాజాగా ఉండటమే కాకుండా, కడుపులోని కండరాలు రిలాక్స్ అయ్యి గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. వామును అజీర్తికి పరమౌషధంగా నిపుణులు చెప్తున్నారు. కడుపు ఉబ్బరం, అసిడిటీ, కడుపులో నొప్పిని తగ్గించడంలో వాము అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే థైమోల్ జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది. జీలకర్ర శరీరంలో మెటబాలిజంను పెంచుతుంది.

Also Read : పాకిస్థాన్‌ కు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఇది ఆహారం త్వరగా అరిగిపోయేలా చేయడమే కాకుండా, శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి కడుపును శుభ్రపరుస్తుంది. ఈ మూడింటిని సమాన మోతాదులో కలిపి ఒక స్పూన్ వరకు తీసుకోవచ్చు. అయితే, ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా సరే అతిగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వామును అతిగా తీసుకుంటే కడుపులో మంట లేదా వికారం కలగవచ్చు. అలాగే గర్భిణీలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ గింజలను తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైజాగ్: నెక్స్ట్ సిలికాన్...

ఐటీలో టాప్‌ కంపెలన్నీ విశాఖకు క్యూ...

కేబినెట్ సమాచారం లీక్.....

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన...

ఉద్యోగులకు ఇచ్చిన హామీ...

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల...

ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!

తెలుగుదేశం పార్టీలో సింగిల్ టైం ఎమ్మెల్యేలకు...

వైఎస్ఆర్ మరణానికి జగనే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం...

ఢిల్లీ వెలుపల మరో...

అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి మరో...

పోల్స్