Saturday, September 19, 2026 11:18 AM
Saturday, September 19, 2026 11:18 AM

తలనొప్పిగా మారిన క్లీన్ పాలిటిక్స్ నినాదం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “క్లీన్ పాలిటిక్స్” నినాదంతో ముందుకొచ్చిన జనసేన పార్టీ ఇప్పుడు తన సొంత ఎమ్మెల్యేల వ్యవహారశైలితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పవన్ కళ్యాన్‌కు.. ఇప్పుడు వారిపై వస్తున్న వరుస ఆరోపణలు రాజకీయంగా సవాల్‌గా మారుతున్నాయి. ప్రజల్లో నైతిక విలువలతో రాజకీయాలు చేస్తామని నమ్మకం కల్పించిన జనసేన పార్టీ.. ఇప్పుడు అదే విలువల ముందు పరీక్షను ఎదుర్కొంటోంది.

జనసేన విజయానికి కారణమైనది కేవలం ఓటర్ల మద్దతు మాత్రమే కాదు.. “క్లీన్ పాలిటిక్స్” అనే నమ్మకం. తాజా పరిణామాలు ఆ నమ్మకాన్ని సవాలు చేస్తున్నాయి. ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు కేవలం వ్యక్తిగత సమస్యలు కాదు… అవి పార్టీ సిద్ధాంతాలపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా వచ్చిన నేతల్లో కనిపిస్తున్న అపరిపక్వత, అధికార దుర్వినియోగం వంటి అంశాలు పార్టీ భవిష్యత్తుకు హెచ్చరికలుగా మారుతున్నాయి.

Also Read : శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో భారీ మోసం

జనసేన ఎమ్మెల్యేలలో చాలామంది కొత్త వారే కావడం సమస్యలకు కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అధికార అనుభవం లేకపోవడంతో కొందరు అహంకార ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికారులపై ఒత్తిడి, ఏకపక్ష నిర్ణయాలు కూటమి భాగస్వామ్య పార్టీలతో ఘర్షణలకు దారి తీస్తున్నాయి.

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యక్తిగత వివాదం జనసేనకు తలనొప్పిగా మారింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు, బాధితురాలిపై కార్యకర్తలు దాడి చేసిన ఘటన.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. హైకమాండ్ స్పందనలో ఆలస్యం కేడర్‌లో అయోమయానికి దారి తీస్తోంది. “తప్పు చేస్తే సొంత వారినైనా వదలను” అని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఈ అంశంపై మౌనం వహించడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది.

విశాఖపట్నం శివారు ప్రాంతానికి చెందిన ఓ కీలక ఎమ్మెల్యేపై పారిశ్రామికవేత్తలు, రియల్టర్ల నుంచి భారీ వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. భూ వివాదాల్లో జోక్యం. సెటిల్మెంట్లు వంటి ఆరోవణలు జనసేన ప్రకటించిన పారదర్శక రాజకీయాలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవిపై మనీలాండరింగ్ ఆరోపణలు రావడం పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టింది.

Also Read : అమెరికాకు కోలుకోలేని దెబ్బ.. రూ.12 వేల కోట్ల ట్రైటన్ డ్రోన్ మిస్సింగ్..!

ఇటీవల ఎమ్మెల్యేలతో సమావేశమైన పవన్ కళ్యాణ్, “ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఉపేక్షించేది లేదు” అని హెచ్చరించినట్లు సమాచారం. ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై రహస్య సర్వేలు జరుగుతున్నాయని, అవినీతికి పాల్పడితే టికెట్లు ఉండవని స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జనసేన పార్టీ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది. వివాదాస్పద ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో పార్టీపై ఉన్న నమ్మకం నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లేదంటే “క్లీన్ పాలిటిక్స్” నినాదం ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్