Monday, April 6, 2026 08:27 PM
Monday, April 6, 2026 08:27 PM

అదిరిపోయిన రష్మిక బర్త్ డే గిఫ్ట్..!

పెళ్లి తర్వాత తొలి పుట్టిన రోజు జరుపుకున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. దీంతో ఈ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు ఆమె స్పెషల్ గిఫ్ట్ అదిరిపోయింది. రష్మిక నటిస్తున్న కొత్త సినిమా ‘మైసా’ నుంచి చిత్ర బృందం ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ విడుదల చేసింది. రవింద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా నుంచి వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ పోస్టర్‌లో రష్మిక మునుపెన్నడూ చూడని అవతారంలో కనిపించారు. ముఖంపై గాయాలు, రక్తం, మట్టితో ఉన్నప్పటికీ.. ఆమె కళ్లలో మాత్రం కసి, ఆగ్రహం బలంగా కనిపిస్తున్నాయి. తన పాత్ర ఎంతటి భయానక పరిస్థితులను ఎదుర్కుందో ఈ లుక్ స్పష్టం చేస్తోంది. ఇంతకు ముందు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌లు సినిమాపై అంచనాలను పెంచగా, ఈ కొత్త పోస్టర్ ఆ హైప్‌ను మరింత పెంచింది.

Also Read : ఫౌజీ లీకులపై మేకర్స్ సీరియస్.. లీక్ చేస్తే అంతే..!

గోండు తెగ ప్రజల సాంస్కృతిక నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక ఒక బలమైన గోండు యువతి పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్, భావోద్వేగాల కలబోతగా పాన్-ఇండియా స్థాయిలో అన్‌ఫార్ములా ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.

అలాగే తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక నటిస్తున్న మరో సినిమా ‘రణబాలి’. పెళ్లి తర్వాత ఈ జంట నటిస్తున్న తొలి సినిమా రణబలి. ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్, స్పెష‌ల్ వీడియో ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో రష్మిక పోషిస్తున్న ‘జయమ్మ’ పాత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్‌, మేకింగ్ వీడియోను విడుదల చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇలా అయితే కష్టమే.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

అధికారుల తీరును బహిరంగంగా.....

అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన ఏపీ...

నరసరావుపేటలో వైసీపీలో రచ్చరచ్చ.....

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వైసీపీలో.....

సట్టా బజార్ షాకింగ్...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ...

ఏపీలో మరో రేపిస్ట్...

ఏపీలో అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం...

యుద్ధం.. అప్రకటిత లాక్...

పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను...

పోల్స్