బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ ది రివేంజ్ సినిమా వసూళ్ళ విషయంలో దూసుకుపోతోంది. ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన భారీ అంచనాలతో సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ క్రియేట్ చేస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగరాస్తోంది. సినిమాలోని మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయనే చెప్పాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజే ఏకంగా 102 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించింది.
Also Read : ఆస్తుల నిజం జగన్ కు, దేవుడుకి తెలుసు: విజయమ్మ
ఈ సినిమా కేవలం హిందీలోనే కాకుండా, సౌత్ ఇండియాలో కూడా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు వెర్షన్ మొదటి రోజు సుమారు 2.12 కోట్లు వసూలు చేసింది. దాదాపు 1,112 షోలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సందడి చేస్తోంది. మల్టీప్లెక్స్ లలో 70 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. తమిళ వెర్షన్ లో కోటి రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా మొదటి రోజే రూ.150 కోట్ల మార్కును దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read : మూవీ రివ్యూ : దురంధర్: ది రివెంజ్
ఇక బుక్ మై షో బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. బుక్ మైషో లో ఈ సినిమా టిక్కెట్ల కోసం జనం ఎగబడుతున్నారు. గంటకు 1.09 లక్షల టిక్కెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఈ సినిమా ఇండియా వైడ్ గా రూ. 43 కోట్లు కొల్లగొట్టింది సినిమా చూసిన ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ టాక్ ఇవ్వడంతో ఈ వీకెండ్ వసూళ్లు ఇంకా భారీగా ఉండే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా జరగడం ప్లస్ అవుతోంది. లాంగ్ వీకెండ్ కావడం, రంజాన్ వంటి సెలవలు ఉండటం కూడా సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

