Friday, June 19, 2026 07:23 AM
Friday, June 19, 2026 07:23 AM

అమెరికా మంత్రులను భయపెట్టిన డ్రోన్ లు..!

ఓ వైపు ఇరాన్ తో యుద్దంలో చుక్కలు చూస్తున్న అగ్ర రాజ్యం అమెరికాకు కొన్ని డ్రోన్ లు సవాల్ గా మారాయి. అగ్రరాజ్యం అమెరికా రక్షణ వ్యవస్థనే సవాలు చేస్తూ, అత్యంత కీలకమైన వ్యక్తులు నివసించే సైనిక స్థావరంపై గుర్తుతెలియని డ్రోన్లు చక్కర్లు కొట్టడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. ఈ ఘటన కేవలం భద్రతా వైఫల్యం మాత్రమే కాదు, అమెరికా అంతర్గత భద్రతకు పొంచి ఉన్న పెద్ద ముప్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : కవిత పార్టీ పేరు ఇదే..? పొలిటికల్ రీ-ఎంట్రీకి రెడీ..!

అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.కి సమీపంలో ఉన్న జాయింట్ బేస్ అనకోస్టియా-బోలింగ్ పై ఈ డ్రోన్లు కనిపించాయి. ఈ స్థావరం అమెరికాకు అతి ముఖ్యం. ఇక్కడ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్‌ సెత్ వంటి అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు నివసిస్తున్నారు. దేశ భద్రతను శాసించే ఇద్దరు కీలక మంత్రులు ఉన్న చోటే ఈ డ్రోన్లు రావడం గమనార్హం. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి సమయాల్లో ఈ భారీ డ్రోన్లు ఆకాశంలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇవి సాధారణంగా పిల్లలు ఆడుకునే చిన్న డ్రోన్లు కాదని అమెరికా అధికారులు గుర్తించారు.

Also Read : ఆళ్ల ప్లాన్ రివర్స్.. మలుపు తిరిగిన అమరావతి కేసు

ఇవి అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘ఇండస్ట్రియల్ గ్రేడ్’ డ్రోన్లని ప్రాథమికంగా గుర్తించారు. ఈ డ్రోన్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? వీటిని ఎవరు నియంత్రిస్తున్నారు? అనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. ఇవి ఆ స్థావరంపై నిఘా పెడుతున్నాయా? లేదా అక్కడ ఉన్న కీలక నేతల కదలికలను గమనిస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ మరియు చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం అనుమానాలను రేకెత్తిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్