Wednesday, March 18, 2026 08:38 PM
Wednesday, March 18, 2026 08:38 PM

జగన్ ఉంటే చాలు శత్రువులు అవసరం లేదు..!

గత కొన్నాళ్ళుగా వైసీపీని టార్గెట్ చేస్తూ వస్తోన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాజాగా విజయనగరం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేసారు. ‘అన్న’ అనే పదానికి కళంకం జగన్మోహన్‌రెడ్డి అంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అసలు ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదన్నారు. మీరు వెలివేస్తేనే సునీత ఒంటరి పోరాటం చేస్తోందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మీరు న్యాయం చేయనందునే సునీతకు ఈ కర్మ పట్టిందన్నారు షర్మిల. వివేకా హత్యలో ముమ్మాటికి అవినాష్ రెడ్డిది కీలక పాత్ర అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

Also Read : మైలవరం ఎమ్మెల్యే పర్యటనలో రచ్చ రచ్చ..!

వివేకానందరెడ్డిని సునీత భర్త హత్య చేసినట్లు అవినాష్‌ రెడ్డి చిత్రీకరించే ప్రయత్నం చేశారు.. వివేకానందరెడ్డిని సునీత భర్త సొంత తండ్రిలా చూసుకునేవారన్నారు. వివేకా హత్యను గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి మీడియా అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వివేకా హత్య టీడీపీ పనే అని చెప్పింది జగన్మోహన్‌ రెడ్డి అంటూ షర్మిల మండిపడ్డారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరింది జగనే.. వివేకా హత్యను అడ్డం పెట్టుకుని సీఎం అయింది కూడా జగనే అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు.

Also Read : సీనియర్ అధికారులు వర్సెస్ ట్రంప్.. యుద్ధం వద్దంటే వద్దు..!

జగన్ సీఎం అయ్యాక, సునీత సీబీఐ విచారణ కోసం ఎంత కోరినా ఒప్పుకోలేదని షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. వివేకా హత్య కేసును ఎందుకు కొలిక్కి తేలేకపోయారు..? అంటూ షర్మిల నిలదీశారు. మీడియా, సోషల్ మీడియా చేతిలో ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. వివేకా హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగిందన్నారు షర్మిల. కడప ఎంపీ పదవికి అవినాష్‌రెడ్డి సరికాదని వివేకానందరెడ్డి స్వయంగా నాతో చెప్పుకున్నారని, వివేకానందరెడ్డి ఎంత చెప్పినా.. జగన్ కడప ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికే ఇచ్చారని, వివేకానందరెడ్డి బతికి ఉంటే తనకు ఎప్పటికైనా అడ్డే అని అవినాష్‌రెడ్డి భావించారని మండిపడ్డారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

హెరిటేజ్‌కి రాయితీలు.. అసలు...

ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానం 4.0...

ఏపీలో ఇంద్రధనుస్సు.. దివ్యాంగులకు...

ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కూటమి...

డ్రగ్స్ అవసరం ఏంటి..?...

ఇటీవల డ్రగ్స్ పార్టీ కేసులో దొరికిన...

మైలవరం ఎమ్మెల్యే పర్యటనలో...

అధికార పార్టీల ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా...

పైలట్ రోహిత్ రెడ్డి...

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్...

త్రిషకు చెన్నైలోనే సీటు..?...

తమిళ రాజకీయాల్లో టీవీకే అడుగు పెట్టిన...

పోల్స్