Friday, June 19, 2026 03:03 AM
Friday, June 19, 2026 03:03 AM

పైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్‌కు సర్కారు తాళం..?

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్న తరుణంలో, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఫాం హౌస్‌ను సీజ్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు వేదికైన పైలట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ ఇప్పుడు అధికారికంగా సీజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగిన నిర్మాణాలు, భూ వివాదాల నేపథ్యంలో అధికారులు ఈ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Also Read : రక్త హీనత ఉంటే కాఫీ, టీ తాగకూడదా..?

మొయినాబాద్‌ పరిధిలో ఉన్న ఈ ఫాం హౌస్ నిర్మాణంలో పలు నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జీవో 111 లేదా స్థానిక పంచాయతీ అనుమతుల విషయంలో లొసుగులు ఉన్నాయని రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే అంతర్గత నివేదికలు సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. కొన్నేళ్లుగా ఈ ఫాం హౌస్ కేవలం విశ్రాంతి కేంద్రంగానే కాకుండా, రాజకీయ వ్యూహాలు మరియు వివాదాస్పద సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

Also Read : హైదరాబాద్ లో బార్లు, రెస్టారెంట్ లలో చికెన్ తింటున్నారా..?

అటు బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం కూడా ఈ ఫాం హౌస్ వ్యవహారాల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని భావిస్తోంది. రోహిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన తాండూరు ప్రాంతానికి చెందిన పలువురు బాధితులు ఆయన భూ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఫాం హౌస్ ఉన్న భూమి యొక్క పూర్వాపరాలను, రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ చిన్న ఆధారం దొరికినా తక్షణమే నోటీసులు ఇచ్చి, ఫాం హౌస్‌ను సీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. బీఆర్‌ఎస్ పార్టీ ఆయనను వదిలించుకునే పనిలో పడటంతో, ఇప్పుడు ఆయనకు ‘రాజకీయ రక్షణ’ కరువైంది. పార్టీ అండ లేకపోవడంతో అధికారులు కూడా ఎటాక్ చేయడానికి వెనకాడటం లేదు. ఫాం హౌస్ సీజ్ అనేది ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బకొట్టే మొదటి అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్