Thursday, September 17, 2026 04:38 PM
Thursday, September 17, 2026 04:38 PM

నయనతార కావాలన్న ఎంపీ.. తమిళనాట రచ్చ రచ్చ..!

తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చేస్తోన్న రాజకీయ విమర్శలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కార్యక్రమంపై ఎంపీ, ఏఐఏడీఎంకే నేత సి.వి. షణ్ముగం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని విమర్శించే క్రమంలో ఆయన వాడిన భాష, ఉదాహరణలు వివాదాస్పదంగా మారాయి. “మీ కలలు మాకు చెప్పండి” అనే కార్యక్రమాన్ని సిఎం స్టాలిన్ మొదలుపెట్టారు.

Also Read : వన్డేలపై సూర్య కుమార్ సంచలన కామెంట్స్..!

దీని ప్రకారం.. ప్రభుత్వ వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి, పాలనపై ప్రజల అభిప్రాయాలను, వారి కోరికలను, సూచనలను సేకరిస్తారు. ప్రజల కలలను నిజం చేయడమే ఈ పథకం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకాన్ని విమర్శిస్తూ షణ్ముగం విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు: వలంటీర్లు ఇంటికి వచ్చి “నీ కల ఏంటి?” అని అడగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా “నాకు నయనతార కావాలి” అని కలగంటే, ముఖ్యమంత్రి అది కూడా తీరుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.

Also Read : నేను హార్ట్ పేషెంట్.. పుట్టా మహేష్ సంచలన కామెంట్స్

అభివృద్ధి పక్కన పెట్టి, ఇలాంటి సిల్లీ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేయాల్సిన పని ఇది కాదని మండిపడ్డారు. షణ్ముగం వ్యాఖ్యలు ఒక మహిళను, ముఖ్యమంత్రిని కించపరిచేలా ఉన్నాయని డీఎంకే నేతలు మండిపడుతున్నారు. వలంటీర్లు వచ్చేది ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, వ్యక్తిగత కలల గురించి కాదని మండిపడుతున్నారు. ఒక సినీ నటి పేరును ఇలాంటి సందర్భాల్లో లాగడం ఆమె వ్యక్తిత్వాన్ని హేళన చేయడమేనని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

కూటమిలో చిచ్చు పెట్టిన...

అధికార కూటమిలో పైకి సమన్వయం కనిపిస్తున్నా.....

పోల్స్