Thursday, September 17, 2026 05:21 PM
Thursday, September 17, 2026 05:21 PM

అమరావతిలో అమరజీవికి అద్బుత నివాళి..!

తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసేందుకు ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా..నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఆవిష్కరిస్తోంది. పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల అలుపెరుగని దీక్షకు గుర్తుగా, ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ అని నామకరణం చేశారు. తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు వద్ద ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు..ఇది తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం.

Also Read : పార్టీలో చంద్రబాబుకు ఎందుకీ తలనొప్పి..?

మొత్తం 6.80 ఎకరాల స్థలంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్. వారి అభ్యర్ధన మేరకు భూమిని AP ప్రభుత్వం కేటాయించగా బడ్జెట్‌ను విరాళాల ద్వారా ట్రస్ట్ సేకరించింది.కేవలం 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో పనులు చేపట్టి 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఫస్ట్ ఫేజ్ లో 58 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు.

ఈ 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌ను ఉపయోగించారు. మొత్తం 3 అంతస్తుల్లో ఉండే బేస్ మీద విగ్రహాన్ని నిలబెట్టారు. ప్రస్తుతం ఈ విగ్రహానికే ఆవిష్కరణ జరుగబోతోంది. ఇప్పటి వరకూ 25 కోట్లు ఖర్చు అయ్యాయని సమాచారం.రెండో దశలో ఇక్కడ మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఇవన్నీ విగ్రహం క్రింద ఉన్న బేస్ లో ఉండే మూడు అంతస్తుల్లో వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన 6.8 ఎకరాల్లో విగ్రహం ఉన్న భాగం పోగా మిగిలిన ఖాళీ స్థలాన్ని స్మృతి వనం గా డెవలప్ చేయబోతున్నారు. వీటికి మరో 125కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు.

Also Read : సిట్ ముందుకు అనంత్ బాబు భార్య.. అరెస్ట్ ఖాయమా..?

పొట్టి శ్రీరాములు కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసమే పోరాడలేదు. ఆయన జీవితమంతా సామాజిక సంస్కరణల కోసమే పోరాటం చేశారు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచి, అంటరానితనానికి వ్యతిరేకంగా గళమెత్తారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని నెల్లూరులో ఆయన చేసిన పోరాటం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఈ క్రమంలో తన భార్యాబిడ్డలను కోల్పోయారు. ఉన్నతమైన రైల్వే ఉద్యోగాన్ని వదులుకున్నారు. మహనీయులను కుల సంఘం విగ్రహాలుగానో, ఒక వర్గం ఆస్తిగానో చూడటం ఆపి, వారిని అందరివాడిగా గౌరవించినప్పుడే జాతికి అసలైన గౌరవం దక్కుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్