Friday, May 1, 2026 03:15 AM
Friday, May 1, 2026 03:15 AM

భారత నిఘా వ్యవస్థపై అమెరికా కుట్ర..?

ప్రతీ దేశానికి నిఘా వ్యవస్థ అనేది అత్యంత కీలక విభాగం. దేశ రక్షణ, విదేశీ కుట్రలు, దేశంలో జరుగుతోన్న కార్యాకలాపాలన్నిటిపై ఓ కన్నేసి ఉంచడం నిఘా వ్యవస్థల శైలి. అమెరికాకు సిఐఏ, ఇజ్రాయిల్ కు మోస్సాద్, పాకిస్తాన్ కు ఐఎస్ఐ, అలా భారత నిఘా వ్యవస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నిఘాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి నిఘా సంస్థపై అమెరికాకు చెందిన ఓ సంస్థ ఇచ్చిన నివేదిక వివాదాస్పాధంగా మారింది. భారత నిఘా సంస్థ ‘రా’ అలాగే ఆర్‌ఎస్‌ఎస్ పైన ఆంక్షలు విధించాలని అమెరికా మత స్వేచ్ఛ ప్యానెల్ (USCIRF) చేసిన సిఫార్సులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి.

Also Read : ముఖం చాటేసిన మంత్రులు..!

దీనిని భారత నిఘా వ్యవస్థను బలహీనపరిచేందుకు జరుగుతున్న ఒక అంతర్జాతీయ కుట్రగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్న తరుణంలో, మన దేశ భద్రతా మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికా ప్రభుత్వ పరిధిలోని స్వతంత్ర సంస్థ అయిన యూఎస్సిఐఆర్ఎఫ్, భారత నిఘా సంస్థ ‘రా’ అధికారులపై ఆంక్షలు విధించాలని కోరడం వెనుక కారణాలు ఏంటీ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ముఖ్యంగా దేశ సరిహద్దుల వెలుపల దేశ ప్రయోజనాలను కాపాడటంలో ‘రా’ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ‘రా’ సాధించిన విజయాలు పాక్ సహా ఆ దేశానికి సహకరించే ఎన్నో దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ హత్య కుట్ర ఆరోపణలను సాకుగా చూపి, మన నిఘా సంస్థ అధికారుల ఆస్తులను స్తంభింపజేయాలని, వారిపై వీసా నిషేధం విధించాలని కోరడం.. భారత భద్రతా వ్యవస్థ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read : అందుకే ఇరాన్ మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న జైశంకర్..!

అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ ను మత స్వేచ్ఛకు విఘాతంగా చిత్రించడం ద్వారా భారత్‌ ను అంతర్జాతీయ వేదికలపై దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలతో పోలుస్తూ భారత్‌ ను ‘ప్రత్యేక ఆందోళన కలిగించే దేశం’ జాబితాలో చేర్చాలని పదేపదే కోరడం వెనుక ఉన్న పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్న సమయంలోనే ఈ నివేదిక రావడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇతర దేశాల్లో జరుగుతున్న దారుణాలను వదిలేసి, ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ పైనే పదేపదే బురదజల్లడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దౌత్యపరమైన చర్చల్లో భారత్‌ను లొంగదీసుకునేందుకు ఇలాంటి నివేదికలను ఒక అస్త్రంగా వాడుకునే అవకాశం ఉందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్