Friday, May 1, 2026 06:55 AM
Friday, May 1, 2026 06:55 AM

ముఖం చాటేసిన మంత్రులు..!

ఏపీలో కొందరు మంత్రుల తీరు ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా కొందరు మంత్రులు దూరంగా ఉంటున్నారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. త్వరలో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు ఉంటాయనే పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో ప్రస్తుత క్యాబినెట్‌లోని సగం మందికి ఉద్వాసన తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో ఆయా మంత్రులు ఇప్పటి నుంచే తమ జాగ్రత్తలో తామున్నారనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : రాజకీయాల్లోకి అలేఖ్య రెడ్డి..!

చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్యంగా క్రమశిక్షణ చాలా అవసరం. సమయ పాలనకు ఆయన పెద్ద పీట వేస్తారు. అది ఎలాంటి సమావేశమైన సరే.. అంతా సవ్యంగా జరగాలని.. అందరు తప్పని సరిగా హాజరవ్వాలనేది చంద్రబాబు మాట. అందుకే ప్రతి రెండు నెలలకు ఓసారి అన్ని శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. మంత్రులకు ర్యాంకులు కేటాయిస్తారు కూడా. ఫైళ్ల పరిష్కారంలో ఏ శాఖ ఎంత వేగంగా పని చేస్తుంది.. ఏ మంత్రి ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారని బహిరంగంగానే ప్రకటిస్తారు. బాగా పని చేసిన వారికి మెచ్చుకోలు… నిర్లక్ష్యంగా ఉన్న వారికి చీవాట్లు, వార్నింగ్ కూడా ఉంటుంది. తన వద్ద ఉన్న శాఖల పనితీరుకు కూడా చంద్రబాబు మార్కులు వేస్తారు.

ఇంత ఖచ్చితంగా ఉండే చంద్రబాబు ఆధ్వర్యంలోని మంత్రివర్గ సమావేశం అంటే.. మంత్రులు, అధికారులు ఎంతో అలర్ట్‌గా ఉండాలి. కానీ శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశానికి ఏకంగా ఆరుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా ఉన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఆ పనుల కారణం.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా క్యాబినెట్ భేటీకి దురంగా ఉన్నట్లు తెలుస్తోంది. హోమ్ మంత్రి వంగలపూడి అనితతో పాటు గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్‌లు అనారోగ్య సమస్యల కారణంగా సమావేశానికి రాలేకపోతున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చారంట.

Also Read : పెళ్లిపీటలెక్కనున్న అనుష్క.. ఈసారి నిజంగానే..?

మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ మాత్రం తన భార్య మొదటి వర్థంతి ఉన్న కారణంగా మంత్రివర్గ సమావేశానికి రావటం వీలు కాదని ముందే చెప్పారంట. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశానికి కూడా పవన్ దూరంగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి కూడా పవన్ హాజరు కాలేదు. అయితే ఈ నెల 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. పవన్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారా అనే అనుమానం కూడా వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించాలని మైత్రీ సంస్థ భావిస్తోంది. అందుకే పవన్ మంత్రివర్గ సమావేశంతో పాటు కలెక్టర్ల మీటింగ్‌కు కూడా రాలేదని సన్నిహితులు చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్