Saturday, March 14, 2026 09:04 PM
Saturday, March 14, 2026 09:04 PM

బిజెపికి షాక్ ఇచ్చిన విజయ్..!

ప్రాంతీయంగా కొత్తగా పుట్టిన పార్టీలు అయినా, పాత పార్టీలు అయినా సరే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు సన్నిహితంగా ఉండాలి లేదా ఢిల్లీ కేంద్రంగా నడిచే పార్టీలతో కలిసి ప్రయాణం చేయాలి. కానీ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత, దళపతి విజయ్ మాత్రం బిజెపికి షాక్ ఇచ్చారు. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డియేతో తన పార్టీ పొత్తు పెట్టుకోబోతోందంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Also Read : రాజకీయాల్లోకి ప్రీతి రెడ్డి.. గులాబీలో గుబులు..!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని జాతీయ మీడియా వర్గాల్లో విజయ్.. ఎన్డియే తో కలిసి నడిచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఎన్డియేతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. మా పార్టీ సిద్ధాంతాలకు, బీజేపీ విధానాలకు అస్సలు పొంతన లేదు అని క్లారిటీ ఇచ్చేసారు. ఈ ప్రచారమంతా కేవలం ఊహాగానాలేనని, ఇందులో ఏమాత్రం నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. తమిళనాడులో ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న విజయ్, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టారు.

Also Read : రేవంత్‌ ధీమా.. మరి చంద్రబాబు..!

ప్రజల పక్షాన నిలబడటమే మా లక్ష్యం. ఏ పార్టీకి బి-టీమ్‌గా ఉండాల్సిన అవసరం మాకు లేదు అని అటు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. విజయ్ ఇచ్చిన ఈ క్లారిటీతో తమిళ రాజకీయాల్లో పొత్తులపై ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకేలను ఎదుర్కోవడానికి విజయ్ ఒంటరిగానే వెళ్తారా లేక ఇతర చిన్న పార్టీలతో కలిసి కూటమి కడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు శశికళ కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీతో కలిసి ఆయన ప్రయాణం చేసే అవకాశం ఉందనే కథనాలు కూడా వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మీకోసమే ఇదంతా.. గిరిజనులతో...

ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజన...

వాళ్ల కంటే.. గూగుల్...

"మేము చేసింది చెప్పుకోలేక పోయాము.. చేసింది...

రాజకీయాల్లోకి ప్రీతి రెడ్డి.....

రాజకీయాల్లోకి మరో వారసురాలు రెడీ అయ్యారు....

ఎన్టీఆర్ ను అభిమానించే...

హెచ్ జే దొర.. ఈ తరానికి...

రాజకీయాల్లోకి అలేఖ్య రెడ్డి..!

అలేఖ్య రెడ్డి.. ఈ పేరు పెద్దగా...

రేవంత్‌ ధీమా.. మరి...

మీ పెట్టుబడులు సురక్షితం.. మీ పెట్టుబడికి...

పోల్స్