ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కంపెనీ ఇదే అడుగులు వేస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ల మాతృ సంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. తాజా నివేదికల ప్రకారం, కంపెనీ తన మొత్తం ఉద్యోగులలో, దాదాపు 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించే అవకాశం ఉంది. సుమారు 16,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం కనపడుతోంది.
Also Read : కొరివితో తలగోక్కున్న కావ్య మారన్..!
మెటాలో ప్రస్తుతం సుమారు 79,000 మంది ఉద్యోగులు ఉండగా, తాజా ప్రణాళికల ప్రకారం 20 శాతం మందిని తొలగించే అవకాశం కనపడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కంపెనీ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ ఖర్చులను తట్టుకునేందుకు గానూ.. భారీగా ఉద్యోగుల తొలగింపు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో దాదాపు 10 శాతం (సుమారు 1,500 మంది) ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మరిన్ని విభాగాలపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Also Read : సీఎంఓ వర్సెస్ ఐఏఎస్.. రూల్స్ ప్రకారమే..!
మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ 2022, 2023 సంవత్సరాలలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. తాజా నివేదికల ప్రకారం, ఈ రౌండ్ లే ఆఫ్స్ కంపెనీ చరిత్రలోనే భారీ నిర్ణయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తలపై మెటా అధికారికంగా స్పందించనప్పటికీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు ఇప్పటికే కంపెనీలో భారీగా ఉద్యోగులను తొలగించాలని అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా ఐటీ రంగంలో ఈ వార్త ఇప్పుడు పెను కలకలం సృష్టిస్తోంది. ఇటీవల బ్లాక్ సంస్థ కూడా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

