Friday, June 19, 2026 07:07 AM
Friday, June 19, 2026 07:07 AM

బాక్సాఫీస్ పై ఆపరేషన్ దురంధర్.. షేక్ అవుతున్న కలెక్షన్ బాక్స్..!

భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దురంధర్ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. థియేటర్లలో బొమ్మ పడకముందే ఈ సినిమా సరికొత్త రికార్డుల వేట పీక్స్ లో ఉంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం ఏకంగా 60 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ ఇప్పుడు కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. విడుదలకి ముందే ఈ చిత్రం సృష్టించిన సునామీ సౌత్ టూ నార్త్ బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తోంది.

Also Read : రాజకీయాల్లోకి అలేఖ్య రెడ్డి..!

సినిమా విడుదల కావడానికి ముందే టికెట్ల అమ్మకాల ద్వారా దురంధర్ రూ. 60 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇది ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ రికార్డులలో ఒకటిగా నిలిచింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో దాదాపు అన్ని షోలు ‘సోల్డ్ అవుట్’ అయిపోయాయి. ముంబై, ఢిల్లీ వంటి ఉత్తరాది నగరాల్లో కూడా ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. కేవలం భారత్‌లోనే కాకుండా అమెరికా, యూకే వంటి దేశాల్లో కూడా ‘దురంధర్’ అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి.

Also Read : రాజకీయాల్లోకి ప్రీతి రెడ్డి.. గులాబీలో గుబులు..!

అక్కడ కూడా మిలియన్ డాలర్ల మార్కును సులువుగా దాటేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా చేస్తున్న భారీ ప్రమోషన్లు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, దురంధర్ తొలిరోజే రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ ముగిసే సరికి ఈ చిత్రం మరిన్ని బెంచ్‌మార్క్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి దురంధర్ బాక్సాఫీస్ వద్ద అసలైన యుద్ధానికి సిద్ధమైపోయింది. ఈ సినిమా లాంగ్ రన్‌ లో ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్