Friday, June 19, 2026 07:22 AM
Friday, June 19, 2026 07:22 AM

పెళ్లిపీటలెక్కనున్న అనుష్క.. ఈసారి నిజంగానే..?

దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ నటి అనుష్క శెట్టి వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆమె త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అనుష్క శెట్టి బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అతను ఆమె కుటుంబానికి సన్నిహిత పరిచయమున్న వ్యక్తి అని కూడా కొన్ని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : జంతు కొవ్వుపై సుప్రీం కీలక కామెంట్స్

అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అనుష్క శెట్టి లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం ఇవి కేవలం ఊహాగానాలుగానే భావించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, అనుష్క శెట్టి వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె పేరు పలు సందర్భాల్లో హీరో ప్రభాస్ తో కలిపి ప్రచారం కావడం జరిగింది. అయితే ఆ సమయంలో ఇద్దరూ తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని స్పష్టంగా తెలిపారు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తమ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో ఇరు కుటుంబాల అనుమతితోనే ఈ వివాహం నిశ్చయం అయినట్లు తెలుస్తుంది.

Also Read : రాజకీయాల్లోకి అలేఖ్య రెడ్డి..!

సినీ కెరీర్ విషయానికి వస్తే, అనుష్క శెట్టి ఎంపిక చేసుకునే కథల విషయంలో ఎప్పటిలాగే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 2023లో విడుదలైన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం ద్వారా ఆమె మళ్లీ ప్రేక్షకులను అలరించారు. మొత్తానికి, ప్రస్తుతం వినిపిస్తున్న పెళ్లి వార్తలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. అనుష్క శెట్టి నుంచి లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో అన్నదే ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్