Thursday, September 17, 2026 08:09 PM
Thursday, September 17, 2026 08:09 PM

జంతు కొవ్వుపై సుప్రీం కీలక కామెంట్స్

గత ఏడాది కాలంగా తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనంగా మారింది. రాజకీయ విమర్శలు, విచారణలు ఇలా ఏదొకటి హడావుడి జరుగుతూనే ఉంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసుకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే అడుగులు వేసింది. ఇక టీడీపీ, జనసేన ఈ విషయంలో వైసీపీ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ కేసు విషయంలో అటు సిబిఐ అధికారులు తేల్చిన అంశాలపై అస్సెంబ్లీ సమావేశాల వేదికగా యుద్దమే జరిగింది.

Also Read : బీఆర్ఎస్‌లో సీనియర్ల సైలెన్స్.. ఏమైంది..?

ఇక ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై నేడు సుప్రీం కోర్ట్ లో విచారణ జరగగా, సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఆసక్తికర కామెంట్స్ చేసింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా..? అంటూ పిటీషనర్ పై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోందని పేర్కొన్న సుప్రీం కోర్ట్.. పిటిషనర్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సీబీఐకి అందించండి అంటూ సూచించింది. ఈ సందర్భంగా ఈ పిటీషన్ ను క్లోజ్ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

Also Read : యుద్ధం ఆపేది లేదు.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

తిరుమల లడ్డూ అంశంపై మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కొట్టేయడంతో.. ఇది రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సీబీఐ దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోము అని స్పష్టం చేసిన సీజేఐ ధర్మాసనం.. ఆధారాలు ఆలస్యం చేయకుండా సిబిఐకి అందించాలని సూచించింది. ఇక ఇప్పుడు సుప్రీం చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో చర్చ జరిగే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే జంతు కొవ్వు విషయంలో వైసీపీ.. టీడీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్